Srikanth Iyengar| క్షమాపణలు చెప్పిన శ్రీకాంత్ అయ్యంగార్
జాతిపిత మహాత్మా గాంధీపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణలు చెప్పారు. మహాత్మాగాంధీ పట్ల తను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలతో నొచ్చుకున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్తున్నానంటూ వీడియోలో పేర్కొన్నారు.

విధాత : జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు నటుడు శ్రీకాంత్ అయ్యంగర్(Srikanth Iyengar ) క్షమాపణలు(Apology )చెప్పారు. ఇటీవల మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన శ్రీకాంత్ అయ్యంగార్..వీడియోలో రెచ్చిపోయాడు. గాంధీ మహాత్ముడేమీ కాదని, భారత దేశానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన వ్యాఖ్యల పట్ల సర్వత్రా వ్యతిరేకత రావడం, తను నటించిన సినిమా అరి ప్రదర్శనలను నిరసన కారులు అడ్డుకోవడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు, మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేయడం.. ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో శ్రీకాంత్ అయ్యంగార్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
మహాత్మాగాంధీ పట్ల తను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలతో నొచ్చుకున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్తున్నానంటూ వీడియోలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. వారందరినీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ లో ఇలాంటివి మనల్ని విడదీయకుండా చూసుకుంటాను. మనమంతా కలిసి అభివృద్ధిలో ముందుకు సాగుదాం అంటూ శ్రీకాంత్ వీడియోలో స్పష్టం చేశారు.