Anant Ambani| అనంత్ అంబానీ పెళ్లికి వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేశారు..పాకిస్తాన్ స్టూడెంట్స్ వెయ్యి రూపాయ‌ల్లోనే..!

Anant Ambani| రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఎంత అట్ట‌హాసంగా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అనంత్ అంబానీ.. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికని వివాహం చేసుకోగా, వారి వివాహం దేశ వ్యాప్తంగా చర్చ‌నీయాంశం అయింది. ఈ వేడుకలకు దేశ విదేశాల్లోని అతిథ మహారథులకు ఆహ్వానం అందింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ,

Anant Ambani| అనంత్ అంబానీ పెళ్లికి వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేశారు..పాకిస్తాన్ స్టూడెంట్స్ వెయ్యి రూపాయ‌ల్లోనే..!

Anant Ambani| రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఎంత అట్ట‌హాసంగా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అనంత్ అంబానీ.. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికని వివాహం చేసుకోగా, వారి వివాహం దేశ వ్యాప్తంగా చర్చ‌నీయాంశం అయింది. ఈ వేడుకలకు దేశ విదేశాల్లోని అతిథ మహారథులకు ఆహ్వానం అందింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక , మెటా అధినేత మార్కు జుకర్‌బర్గ్, ఆయన సమీమణి ప్రిసిల్లా చాన్ జామ్ న‌గ‌ర్‌లో జ‌రిగిన‌ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని సంద‌డి చేశారు. అయితే వారి వివాహ వేడుకలు ప్రారంభం కావడం నుంచి ముగిసే వరకు మొత్తం రూ.1,000కుపైగా ఖర్చు అయిన‌ట్టు స‌మాచారం. డాలర్ల పరంగా చూస్తే దీని విలువ 120 మిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని టాక్ వినిపించింది.

అయితే అనంత్ అంబాని- రాధిక‌లు వెయ్యి కోట్లు ఖ‌ర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ మెడిక‌ల్ కాలేజ్ విద్యార్ధులు వెయ్యి రూపాల‌తోనే అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహ వేడుక‌లని రీక్రియేట్ చేశారు. అందుకు సంబంధించిన స‌న్నివేశాల‌ని నూర్ తాహిర్ అనే అమ్మాయి త‌న ఇన్‌స్టా వీడియో ద్వారా ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ఈ వీడియో చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. వీడియోలో జామ్ న‌గ‌ర్‌లో జ‌రిగిన ఈవెంట్‌ని రీక్రియేట్ చేసి చూపించారు. ముందుగా అనంత్ అంబాని మాదిరిగే దుస్తులు ధ‌రించి ఓ విద్యార్ధి న‌డుచుకుంటూ వ‌చ్చాడు. ఆ త‌ర్వాత రాధిక మర్చంట్ మాదిరిగా ఓ యువ‌తి రెడీ అయి ర్యాంప్ వాక్ చేసింది

నీతా అంబానీ, ఇషా అంబానీ, షారూఖ్ ఖాన్, దిల్జిత్ దోసాంజ్, కరీనా కపూర్ ఖాన్ వంటి సినీ తారల మాదిరిగా వైద్య విద్యార్ధులు రెడీ అయి వారు తెగ సంద‌డి చేశారు. ఖాన్ త్ర‌యం నాటు నాటు సాంగ్‌కి డ్యాన్స్ వేయ‌గా, ఈ సీన్‌ని కూడా వారు రీ క్రియేట్ చేశారు. వారి టాలెంట్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. గెట్ టూ గెద‌ర్ పార్టీలో భాగంగా వారు అనంత్ అంబాని- రాధిక ప్రీ వెడ్డింగ్‌ని రీ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం వారి వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వీడియోని చూసిన ప్ర‌తి ఒక్క‌రు వారి టాలెంట్‌ని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు.