CM Revanth Reddy| తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
విధాత, హైదరాబాద్ : తెలంగాణ(Telangana)లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు(Heavy Rains), వరదల(Flood Situations) సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. సీఎం జూబ్లీహిల్స్ నివాసంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్కలు హాజరయ్యారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు అధికారులకు అదేశాలు జారీ చేశారు.
కామారెడ్డి(Kamarreddy), మెదక్(Medak) జిల్లాల్లో క్లౌడ్ బరెస్టుతో సంభవించిన వరదల పరిస్థితులపై మంత్రి సీతక్క ఏరియల్ సర్వే చేపట్టనున్నట్లుగా సమాచారం. వరదల తీవ్రతతో వాటిల్లిన నష్టం..ప్రాజెక్టుల పరిస్థితులపై నివేదికలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram