Telangana CS| తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు పదవీ కాలం పొడిగింపుకు నిర్ణయం?

విధాత, హైదరాబాద్ : ప్రస్తుత తెలంగాణ సీఎస్(Telangana CS) కే.రామకృష్ణారావు(K. Ramakrishna Rao)పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించినట్లు(Extension)గా తెలుస్తుంది. ఆగస్టు 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)నిర్ణయించినట్లుగా సమాచారం. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినట్లుగా తెలిసింది. పదవీ విరమణ చేసిన ఏ ఉద్యోగిని, అధికారిని మళ్ళీ పదవిలోకి తీసుకోవద్దని…పదవీకాలాన్ని పొడిగించ వద్దని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు ఇటీవల వెల్లడించారు. అయితే రామకృష్ణారావు 2025 ఏప్రిల్ 30వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర సీఎస్‌గా కనీసం రామకృష్ణారావు మూడు నెలలు మాత్రమే పనిచేయడంతో మరో మూడు నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం డీఓపీటీకి లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాని పక్షంలో తదుపరి సీఎస్ కోసం మూడుపేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపాల్సి ఉంది. కొత్త సీఎస్ రేసులో ఐఏఎస్ జయేష్ రంజన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది.