Gram panchayat elections| రేపు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో రేపు గురువారం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ సామాగ్రీతో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
విధాత : తెలంగాణ రాష్ట్రంలో రేపు గురువారం తొలి విడత గ్రామ పంచాయతీ(Gram panchayat elections) ఎన్నికల పోలింగ్( first phase polling) జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ సామాగ్రీతో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగునుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4,236 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగాల్సి ఉంది. అయితే 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడం, ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 3,836సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అటు 37,440వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా..9331వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా..149వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 27,960వార్డులకు రేపు పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం 37 వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులు గెలుపు కోసం వారం రోజులుగా విస్తృత ప్రచారం సాగించారు. ఇక ప్రలోభాల పర్వంలో బిజీగా ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేటిదాక హామీలు గుప్పించిన అభ్యర్థులు..పోలింగ్ కు ముందు ఆఖరి పాట్లు పడుతున్నారు. డబ్బు, మద్యం పంపిణీతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తులను అనుసరించి ఓటర్లకు కానుకలు అందిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram