Aarogyasri| ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లిస్తాం : మంత్రి దామోదర రాజనరసింహ
విధాత, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ(Aarogyasri) బిల్లుల బకాయిల(Pending Bills) సమస్యతో ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత(Aarogyasri services suspension)కు ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల యజమాన్యాలు(private hospitals strike) నిర్ణయించిన నేపథ్యంలో బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodara Rajanarasimha) అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యపై బీఆర్ఎస్ సభ్యుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(BRS MLA Sanjay) మాట్లాడుతూ.. బిల్లుల బకాయిల సమస్యతో ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల యజమాన్యాలు ఇవాళ్టి నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేయాలని నిర్ణయించాయని..ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందని.. అయితే రూ.5లక్షల మొత్తం కోటి రూపాయిలు చేశామా, 20 కోట్లు చేశామా అన్నది ముఖ్యం కాదని..బిల్లుల చెల్లింపు కీలకమని సంజయ్ స్పష్టం చేశారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు.
స్పందించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుపై ఇప్పటికే ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల యజమాన్యాలతో చర్చించి హామీ ఇచ్చామన్నారు. ప్రతి నెల 6నుంచి 7 ఇన్ స్టాల్మెంట్లలో బిల్లులను క్లియర్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ రోజు మరోసారి ఆప్పత్రుల యజమాన్యాలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram