Jagadish Reddy| తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుంది: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

విధాత : తెలంగాణ(Telangana)లో పోలీస్ రాజ్యం(Police Rajyam) నడుస్తుందని..మంత్రులకు పాలన చేతగాక ప్జలను నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డుపెట్టుకుని పరిపాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్(BRS) మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి(Jagadish Reddy)విమర్శించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి అక్రమ అరెస్టును ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా పైన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)అక్రమ కేసులు(Illegal Arrests) పెడుతుందని మండిపడ్డారు. యూరియా లైన్ వీడియో తీసి పెట్టినా.. కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. అర్ధం లేని కేసులతో అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయడం..ఓ తాగుబోతు ఇచ్చిన పిర్యాదుతో మా పార్టీ సీనియర్ నాయకున్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఒత్తిడితోనే ఈ రోజు పోలీసులు తలొగ్గి విడుదల చేశారని..చట్టవిరుద్దంగా పోలీసులు నడుచుకోవద్దని హితవు పలికారు. పార్టీ నాయకున్ని కాపాడుకోవడానికి వచ్చిన కార్యకర్తలకు, మహిళలకు అభినందనలు తెలిపారు. ప్రజా ఒత్తిడితోనే ప్రభుత్వం మెడలు వంచాలని..ఇటువంటి ఉద్యమాలు కేవలం కార్యకర్తలను విడిపించుకోవడం కోసమే కాకుండా..కాంగ్రెస్ ఇచ్చిన హామీలు(Congress six guarantees) నెరవేర్చే వరకు కొనసాగుతాయన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వానికి రెండేళ్లు గడువిచ్చినం.. ఇంకా సరిపోలేదా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వానికి రెండేళ్లు గడువు ఇవ్వడం అంటేనే.. అది కేసీఆర్ విజ్ఞతకు నిదర్శనం అన్నారు. 6 గ్యారంటీల్లో మీరు చేస్తున్న మోసాలు ఒకటొకటిగా ఎండగడతాం.. ఎన్ని కేసులు పెడతారో.. ఎంత మందిని జైల్లో పెడతారో తేల్చుకుంటాం అన్నారు. ఉద్యమాలు.. ఇటువంటి కేసులు మాకు కొత్త కావు అన్నారు. ప్రజా ఉద్యమాలు మొదలైతే.. పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరన్నారు. ప్రజల అండ ఉన్నంతవరకు ఇటువంటి కేసులు భయపెట్టలేవన్నారు. సూర్యాపేట, నల్లగొండ ఎస్పీలకు మరోమారు చెబుతున్న.. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పొద్దు అని హెచ్చరించారు. పోలీస్ అధికారులను చట్ట ప్రకారం పని చేసేటట్టు చేయండి అని, ఒకపక్క గంజాయి మూకలతో సమాజం తప్పుదోవ పడుతుంది..ముందు వాటిపై దృష్టి పెట్టండి అని సూచించారు. అక్రమ కేసులపై పెట్టే శ్రద్ధ యూరియా ఇవ్వడం పై పెడితే బాగుంటుందన్నారు.