Kukatpally Toddy Victims| కూకట్‌పల్లి కల్తీ కల్లు బాధితుల్లో ముగ్గురు మృతి

విధాత, హైదరాబాద్ : కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు, ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. మృతులు తులసిరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్ సాయిచరణ్‌కాలనీకి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. మరోవైపు కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ కల్తీ కల్లు తాగి 19మంది అస్వస్థత పాలయ్యారని.. బాధితులకు వాంతులు, విరేచనాలు కొనసాగుతుండగా..వారిలో నిమ్స్ లో 15 మందికి, గాంధీలో ఇద్దరిని, ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
పంజాగుట్ట నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి జూపల్లి పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.