Tomato Price Hike| టమాటా ఫైరింగ్..మొన్న కిలో 1 రూపాయి…నేడు రూ.63 !
అమ్మబోతే అడవి..కొనబోతే కొరవి అన్నట్లుగా ఉంది పంటల పరిస్థితి. ఏపీలో ఈ ఏడాది పంట దిగుబడుల సీజన్ లో కిలో ఉల్లిగడ్డ 30పైసలు..టమాటా కిలో 1రూపాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మేందుకు రవాణా ఖర్చులు దండగ అనుకుని పంటలను ధ్వంసం చేసుకున్నారు. ఇది జరిగి కొన్ని రోజులైన కాలేదు..ఇప్పుడు టమాటా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. 10 రోజుల క్రితం రూ. 10 పలికిన కిలో టమాటా.. మదనపల్లె మార్కెట్లో తాజాగా కిలో రూ. 63 కి చేరింది.
అమరావతి : అమ్మబోతే అడవి..కొనబోతే కొరవి అన్నట్లుగా ఉంది పంటల పరిస్థితి. ఏపీలో ఈ ఏడాది పంట దిగుబడుల సీజన్ లో కిలో ఉల్లిగడ్డ 30పైసలు..టమాటా కిలో 1రూపాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మేందుకు రవాణా ఖర్చులు దండగ అనుకుని పంటలను ధ్వంసం చేసుకున్నారు. ఇది జరిగి కొన్ని రోజులైన కాలేదు..ఇప్పుడు టమాటా ధరలు(Tomato Price Hike) అమాంతంగా పెరిగిపోయాయి. 10 రోజుల క్రితం రూ. 10 పలికిన కిలో టమాటా.. మదనపల్లె మార్కెట్లో(Madanapalle Market) తాజాగా కిలో రూ. 63 కి చేరింది. చాలా చోట్ల మంచి నాణ్యత ఉన్న టమాటకు రూ.80 వరకు రేటు ధర పలుకుతోంది. పెరిగిన టమాటా ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
పడిపోయిన దిగుబడి..పైకి లేసిన ధరలు
టమాటా పంట సాగు సీజన్ చివర్లో వరుసగా మోంథా తుఫాను, ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. అధిక తేమ, చీడపురుగుల ప్రయోగం, మొక్కల్లో మచ్చలు రావడం, పొలాల్లో మగ్గిపోవడం వంటి సమస్యలు దిగుబడిని భారీగా తగ్గించాయి. ఈ నేపథ్యంలో టమాటా దిగుబడులకు, మార్కెట్ లో డిమాండ్ కు మధ్య భారీ వ్యత్యాసం నెలకొనడంతో అమాంతంగా టమాటా ధరలు పెరిగిపోయాయి. దీంతో మదనపల్లి మార్కెట్‌కు టమాటాల రాక భారీగా పడిపోవడంతో ధరలు పెరిగిపోయాయి. గత సంవత్సరం ఇదే సమయంలో రోజుకు 700 మెట్రిక్ టన్నుల టమోటా రాగా.. ప్రస్తుతం అది 150 మెట్రిక్ టన్నులకే చేరిందంటే టామాటా కొరత సమస్యకు నిదర్శనంగా కనిపిస్తుంది.
ధరలు పైపైకే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో దాదాపు 10 వేల హెక్టార్లలో టమోటా సాగు జరుగుతుంది. సీజన్ ప్రారంభంలో టమాటా దిగుబడి బాగానే ఉన్నప్పటికి ధర పడిపోవడం, మొంథా తుపాన్ తో దిగుబడులు తగ్గిపోయాయి. కర్ణాటకలోని కోలారు, చింతామణి, ముల్బాగల్ ప్రాంతాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో టమాటాలు మార్కెట్‌కు సరఫరా కాకపోవడంతో టమాటాలకు డిమాండ్ పెరిగి..ధరలు అమాంతంగా ఎగబాకాయి. ఏపీలో మరో తుపాన్ ముప్పు.. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటం..నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు టమాటాల ధరలు పైపైకే వెలుతాయంటున్నాయి మార్కెట్ వర్గాలు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram