ట్రంప్ ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ క్యాంపెయిన్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'నో ట్యాక్స్ ఆన్ టిప్స్' విధానాన్ని వినూత్నంగా ప్రచారం చేశారు. 'నో ట్యాక్స్ ఆన్ టిప్స్' చట్టం వచ్చి ఏడాది కావడంతో ట్రంప్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వయంగా మెక్‌డొనాల్డ్స్ నుంచి బర్గర్ ఆర్డర్ చేసి..డెలివరీ తీసుకున్నారు.

విధాత : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ విధానాన్ని వినూత్నంగా ప్రచారం చేశారు. ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ చట్టం వచ్చి ఏడాది కావడంతో ట్రంప్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వయంగా మెక్‌డొనాల్డ్స్ నుంచి బర్గర్ ఆర్డర్ చేసి..డెలివరీ తీసుకున్నారు.

‘డోర్‌డాష్ గ్రాండ్మా’ షారన్ సిమన్స్ ఓవల్ ఆఫీస్‌కు వచ్చి డెలివరీ ఇవ్వగా.. మహిళకు 100 డాలర్ల టిప్ ఇచ్చి ట్రంప్ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ చట్టం వల్ల తనకు ఈ ఏడాదిలో 11000 డాలర్ల అదనపు ఆదాయం వచ్చిందని ఆ మహిళ వెల్లడించారు.

ట్రంప్ ప్రభుత్వం ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ విధానాన్ని “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు”గా అమలులోకి తెచ్చారు. 1,50,000 డాలర్లు అంటే సుమారు రూ.1.3 కోట్లు కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. హోటల్, రెస్టారెంట్, సర్వీస్ రంగానికి చెందిన ఉద్యోగులకు టిప్స్ రూపంలో వచ్చే ఆదాయంపై కొత్త ఫెడరల్ ఆదాయపు పన్ను మినహాయింపు అవకాశాన్ని కల్పించారు. వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఈ విధానం తెచ్చారు.

అయితే ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ విధానంపై అమెరికా ఉద్యోగ, కార్మిక సంఘాల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ విధానంతో కార్మికులకు లాభ నష్టాలు రెండు ఉన్నాయన్న వాదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ విధానాన్ని సమర్థించుకునే క్రమంలో ట్రంప్ బర్గర్ ఆర్డర్ చేసి..డెలివరీ తీసుకోవడం ద్వారా ప్రచారం నిర్వహించారు.

 

ఇవి కూడా చదవండి :

Anchor Suma | కారులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. నవ్వు వెనుక ఉన్న కష్టం బయటపెట్టిన స్టార్ యాంకర్
Hyundai Creta | హ్యుందాయ్ క్రెటా నుంచి సమ్మర్ ఎడిషన్.. రూ.58 వేలు పెట్టడం వల్ల లాభమేనా?

Latest News