Vijay TVK Party| తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టుకు టీవీకే అధ్యక్షుడు విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ ..ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ టీవీకే అధ్యక్షుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటనపై(Karur Stampede) సిట్ పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ ..ఈ కేసును సీబీఐకి(CBI Inquiry )అప్పగించాలని కోరుతూ టీవీకే(TVK Party) అధ్యక్షుడు విజయ్(Vijay) సుప్రీంకోర్టును(Supreme Court Petition) ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తు, అధికారుల పాత్రపై ఇదివరకే ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ రాష్ట్ర పోలీసు అధికారులతోనే మద్రాస్ హైకోర్టు సిట్ ఏర్పాటు చేసిందని విజయ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తునకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆయన అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. తమ పార్టీపై సిట్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
విజయ్‌కి నాయకత్వ లక్షణాల్లేవని, ఘటన జరిగిన వెంటనే ఆ పార్టీ నేతలందరూ పారిపోయారని మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు…తొక్కిసలాట తర్వాత అన్ని పార్టీలూ సహాయక చర్యలు చేపడితే, నిర్వాహకులు వెళ్లిపోయారని తప్పుపట్టిన సంగతిని విజయ్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. తన ర్యాలీలో ఇబ్బందులు సృష్టించేందుకు ముందస్తు కుట్రలను తోసిపుచ్చలేమని ఆరోపించారు. ఇదిలాఉండగానే..తొక్కిసలాటలో మృతి చెందిన 13 ఏళ్ల బాలుడి తండ్రి ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలుస్తాను : డీజీపీకి విజయ్ వినతి
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలను కలిసేందుకు తనకు అనుమతివ్వాలంటూ డీజీపీకి విజయ్ మెయిల్ పంపారు. విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శించాలని కోరుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.అంతకుముందు విజయ్ బాధిత కుటుంబాలతో వీడియో కాల్‌లో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన.. త్వరలోనే వారివద్దకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో విజయ్ తప్పులేదని, ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని వారు కోరారని టీవీకే నేత అరుణ్ రాజ్ వెల్లడించారు.