విధాత : విరాట్ కోహ్లీ అంటే అభిమానులలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కోహ్లీ అభిమానులు కోట్ల మంది ఉన్నారు. అలాంటి తమ ఆరాధ్య క్రికెటర్ కళ్ల ముందు కనిపించినప్పుడు ఆటో గ్రాఫ్ పొందలేకపోతే ఎవరికైనా నిరాశ తప్పదు. అందులోనూ చిన్నపిల్లలకు అలాంటి సందర్బం మరింత బాధ కల్గించడం సహజమే. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ కోసం ఢిల్లీకి వచ్చిన కోహ్లీ తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండా వెళ్లిపోవడంతో ఓ బాలుడు అలిగి ఆవేశంతో చేతిలోని బ్యాట్ ను విసిరేసి ఏడుస్తూ వెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీతో ఐపీఎల్ మ్యాచ్ అనంతరం కోహ్లీ ఇయర్ ఫ్యాడ్లు పెట్టుకుని హెటల్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నించిన బాలుడిని సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కోహ్లీ సైతం ఆ చిన్నారి అభిమానిని గమనించకుండా వెళ్లిపోయాడు. అంతే ఇక..కోహ్లీ లిటిల్ హార్డ్ కోర్ ఫ్యాన్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఎంతైన కోహ్లీ అభిమానే కదా..ఆయన కన్న భావోద్వేగాల ప్రదర్శనలో తానేమి తక్కువ అనుకున్నట్లున్నాడు.
తన అభిమాన స్టార్ కోహ్లీ ఆటోగ్రాఫ్ దక్కలేదన్న కోపంతో వెంట తెచ్చుకున్న బ్యాట్ ను అక్కడే హోటల్ లోనే నెలకేసి విసిరేసి బోరున ఏడుస్తూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. పాపం ఆ చిన్నారి అభిమానిని చూసి నెటిజన్లు.. అయ్యో అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసైనా ఆ చిన్నారికి కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చి ఓదార్చి తన పెద్దమనసు చాటుకోవాలని కోరుకుంటున్నారు.
This is how it unfolded: Virat Kohli refused the autograph, the kid threw the bat in anger — peak L generation behavior. https://t.co/Z7c7Gk7Ss9 pic.twitter.com/z4hkEIB6wG
— Magadh Updates (@magadh_updates) April 28, 2026
ఇవి కూడా చదవండి :
సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు..హడలిపోయిన బ్యాంకు సిబ్బంది
ట్రంప్ ఈవెంట్లో కాల్పులు.. ‘అంతా డ్రామా’ అంటూ సోషల్ మీడియాలో రచ్చ!
