Subarnarekha River | భారతదేశంలో బంగారంతో పారే నది ఏంటో తెలుసా?

మన దేశంలోనూ బంగారం పారే నది ఒకటి ఉన్నదని మీకు తెలుసా? ఆ నదిలో స్థానిక గిరిజనులు మట్టిని, ఇసుకను తీసుకుని, దానిని నీటితో చెరుగుతూ శుభ్రం చేసి.. బంగారపు అణువులను సేకరిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టే ఈ నది పేరు కూడా ఉంటుంది.

Subarnarekha River | భారతదేశంలో బంగారంతో పారే నది ఏంటో తెలుసా?

Subarnarekha River |  జార్ఖండ్‌ రాష్ట్రంలో రాంచీ సమీపంలోని నగడి గ్రామీ సపంలోని రాణి చువాన్‌ ప్రాంతంలో పుడుతుంది  సుబర్ణరేఖ నది.  అక్కడి నుంచి పశ్చిమబెంగాల్‌, ఒడిశా మీదుగా ప్రవహిస్తూ చివరకు బంగాళాఖాతంలోకి చేరుతుంది. ఈ క్రమంలో దాని పయనం మొత్తం సుమారు 474 కిలోమీటర్ల ఉంటుంది. ఇది జార్ఖండ్‌లో ప్రవహించే క్రమంలో రత్నగర్భ ప్రాంతంలో కర్కరీ అనే ఉప నది కలుస్తుంది. ఈ రెండు నదులూ బంగారపు అణువులను అనేక తరాలుగా తీసుకొస్తూ ప్రవహిస్తుంటాయని ప్రసిద్ధి. ఈ నదిపేరు సుబర్ణరేఖ.. అంటే బంగారపు ప్రవాహం అని అర్థం. ఈ పేరు పెట్టాక ఇందులో బంగారం ప్రవహించిందా? లేక బంగారం ప్రవహిస్తుందని దీనికి ఆ పేరు పెట్టారా? అనేది కాసేపు పక్కన పెడదాం. కానీ.. కొన్ని శతాబ్దాలుగా ఈ నదిలో బంగారం లభించిందని స్థానికులు కథలు కథలుగా చెప్పుకొంటుంటారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు.

Gold Mines In India | మన బంగారు గనులు..దేశానికి గేమ్-ఛేంజర్

ఇటీవలి కాలంలో డిజిటల్‌ మీడియా పెరిగిన తర్వాత ఈ నదిపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. దీనిని బంగారు నదిగా అభివర్ణిస్తూ వస్తున్నారు. ఒకవైపు ఈ నదికి ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చిందనే అంశంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు స్థానికులు ఈ నది ఇసుక, మట్టిని ఫిల్టర్‌ చేసి, అందునుంచి బంగారపు అణువులను వెలికి తీస్తూ ఉంటారు. నది మట్టి, ఇసుక నుంచి బంగారాన్ని వెలికి తీసే పనిలో తామర్‌, శరంద ప్రాంత స్థానిక గిరిజన తెగలు నిమగ్నమై ఉంటాయి. వర్షాకాలం మినహాయిస్తే ఏడాది పొడవునా ఇక్కడ అదే పనిలో ఉంటారు. అంతేకాదు.. ఈ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా ఈ పని చేస్తూ ఉంటారు. పెద్ద మొత్తంలో ఇసుక, మట్టిని తీసుకుని, నీటిలో మట్టి, ఇసుక చెదిరిపోయేదాకా కడుగుతూ ఉంటారు. చివరికు వారికి అందులో ఒక బియ్యం నూకల కంటే చిన్న సైజులో బంగారుపు రేణువులు లభిస్తాయి. చిన్న మొత్తంలో బంగారం వెలికి తీయడానికి కూడా కొన్ని రోజులు పడుతుంది. ఎంతో ఓపిక, అంతకు మించి గంటల కొద్దీ పని దీనికి అవసరం అవుతుంది.

Digital Gold Investment | డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు మీ కోసమే!

ఈ నది ప్రారంభ ప్రాంతమైన పిస్కాలో బంగార తవ్వకం ఈ సంప్రదాయ పద్ధతులకు ముందే ప్రారంభమైందని చారిత్రక కథనాలను బట్టి తెలుస్తున్నది. ఇలా సేకరించిన చిన్న చిన్న బంగారం రేణువులను స్థానికంగా ఉండే స్వర్ణకారులు శుద్ధి చేసి, ఆ బంగారంతో నగలు తయారు చేసేవారని చెబుతారు. సుబర్ణరేఖ నదికి సాంస్కృతికంగా కూడా గొప్ప స్థానమే ఉన్నది. రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌, భిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ వంటివారి రచనల్లో ఈ నది పేరు ప్రస్తావన ఉంటుంది. సినీ దర్శకుడు రిత్విక్‌ ఘటక్‌ ఏకంగా తన ప్రఖ్యాత సినిమాల్లో ఒకదానికి సుబర్ణరేఖ అని పేరు కూడా పెట్టారు.

ఇవి కూడా చదవండి..

Festival | బురద పండుగ.. 400 ఏండ్లుగా వస్తోన్న ఆచారం.. ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?
IRCTC Best Package: రూ. 11820కే మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగా దర్శనం
Telangana GCC growth | గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాల ఖిల్లా తెలంగాణ