Festival | బురద పండుగ.. 400 ఏండ్లుగా వస్తోన్న ఆచారం.. ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?
పండుగ అనే పేరు వినగానే మనకు ముందుగా పూలు, సువాసనలు, రంగులు, పూజలు, స్వీట్లు లాంటి మనసుకు ఉత్సాహ కలిగించే వస్తువులు, విషయాలు గుర్తుకు వస్తాయి. సాధారణంగా ఏ పండుగ జరుపుకున్నా అవి ఉండాల్సిందే.
విధాత, హైదరాబాద్ :
పండుగ అనే పేరు వినగానే మనకు ముందుగా పూలు, సువాసనలు, రంగులు, పూజలు, స్వీట్లు లాంటి మనసుకు ఉత్సాహ కలిగించే వస్తువులు, విషయాలు గుర్తుకు వస్తాయి. సాధారణంగా ఏ పండుగ జరుపుకున్నా అవి ఉండాల్సిందే. ఇలా మనదేశంలో అనేక ఆచారవ్యవహారాల్లో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని అనాకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని దిమిలి ప్రాంతంలో బురద పండుగను జరుపుకుంటారు. 400 ఏండ్లుగా వస్తున్న ఈ ఆచారంలో స్థానికులు ఒంటినిండా బురద పూసుకుని సంబరాలు చేసుకుంటారు.
దేశ విదేశాల నుంచి స్థానికుల రాక..
మిగతా జాతరలా కాకుండా భిన్నంగా జరిగే బురద పండుగను రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరకు దేశవిదేశాల్లోని స్థానికులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ పండుగను స్థానికులు బురద జాతరగా పిలుచుకుంటారు. ఈ పండుగలో దల్లమాంబగా పిలుచుకునే దేవతను కొలుస్తారు. ఆ దేవతను స్వాగతించే క్రమంలో గ్రామస్తులు ఒంటినిండా బురద పూసుకుంటూ ఉత్సవం నిర్వహిస్తారు. కాగా, ఈ ఉత్సవాల్లో బురద పూసుకోవడం నుంచి మహిళలకు మినహాయింపు ఉంది.
బురద పూసుకోవడం వెనుక శాస్త్రీయత!
ఇక.. ఈ బురద జాతరకు స్థానికులు వారం రోజుల నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. జాతర రోజున తెల్లవారు జాము నుంచే ఉత్సవాలు మొదలవుతాయి. ముందు రోజు రాత్రి నుంచే గ్రామస్తులంతా జాతర కోసం వేచి చూస్తుంటారు. తెల్లవారు జామునే డబ్బు చప్పుల్ల మధ్య బురదను తీసుకొచ్చి అందరూ వేపాకు కొమ్మలతో ఒకరికొకరు బురద పూసుకుంటామని స్థానికులు చెబుతున్నారు. వేపాకు కొమ్మలతో బురద పూసుకోవడం వల్ల చర్మవ్యాధులు దూరం అవుతాయని ప్రజల విశ్వాసం. దీని ద్వారా రోగాలు పోయి బురదమాంబ ఆశీస్సులు తమపై ఉంటాయని గ్రామస్తుల నమ్మకం.
జాతర వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే?
కాగా, బురద పండుగ జరుపుకునే ఆచారంపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం దిమిలి గ్రామంలోకి అర్ధరాత్రి ఓ ఆడపిల్ల దారితప్పి వచ్చిందట.. ఆమెపై కొందరు ఆకతాయిలు లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించగా బురద పూసుకుందట. ఇది గమనించిన గ్రామస్తులు ఆమెను రక్షించడానికి ప్రయత్నించడంతో భయపడి ఆమె అక్కడే ఉన్న ఓ బావిలో దూకడంతో చనిపోయిందట. అయితే, తనను రక్షించడానికి చూసిన వారి కోసం ఆ మహిళ బావిలో దేవతగా వెలిచిందని చెబుతుంటారు. కాగా, ఆమెను బురదతో చూడడంతో ప్రజలు బురదమాంబగా కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో జాతర రోజు మహిళలకు బురదమాంబకు పసుపు కుంకుమలు, నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరలో పాల్గొనకపోతే అరిష్టం జరుగుతుందనే నమ్మకం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram