Bet Turns Tragic| రూ.500కోసం యమునాలో దూకి గల్లంతు!

Bet Turns Tragic| రూ.500కోసం యమునాలో దూకి గల్లంతు!

విధాత : పందెం ఎంత విలువైనదన్నది కాదు..సవాల్ గెలిచామా లేదా అనుకున్నాడేమోగాని ఓ యువకుడు కేవలం రూ.500కోసం యమునా నది(Yamuna River)లో దూకి(man jumps in Yamuna) గల్లంతయ్యాడు(drowning). ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని బాగ్పత్ జిల్లాలో జునైద్ అనే 21ఏళ్ల యువకుడితో ఉదృతంగా ప్రవహిస్తున్న యమునా నదిని ఈదుతూ దాటితే రూ.500ఇస్తామంటూ స్నేహితులు పందెం(Man Drowns for Bet) కాశారు.

స్నేహితులతో పందెంకు అంగీకరించిన జునైద్ ఉదృతంగా పరవళ్లు తొక్కుతున్న యమునా నదిలో దూకాడు. కొద్ధిసేపు ఈత కొట్టి సగం వరకు నదిని దాటినప్పటికి బలమైన వరద ప్రవాహం ధాటికి అతను నదిలో గల్లంతయ్యాడు. స్నేహితులు, పోలీసులు అతడి కోసం యమునలో గాలిస్తున్నారు.