Gold Seized | శంషాబాద్ విమానాశ్రయంలో రూ.1.27 కోట్ల బంగారం పట్టివేత
Gold Seized విధాత: దుబాయ్, దామం నుండి వేరువేరు విమానాల్లో హైదరాబాద్ వచ్చిన నలుగురు ప్రయాణికుల నుండి అక్రమంగా తీసుకొస్తున్న 2.1 కిలోల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి శరీర అంతర్భాగంతో పాటు, లో దుస్తుల్లో అమర్చుకొని వచ్చిన నిందితులు అధికారుల కళ్లు కప్పాలని చూశారు, కానీ పాచిక పారలేదు. పట్టుబడిన బంగారం విలువ 1.27 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు.

Gold Seized
విధాత: దుబాయ్, దామం నుండి వేరువేరు విమానాల్లో హైదరాబాద్ వచ్చిన నలుగురు ప్రయాణికుల నుండి అక్రమంగా తీసుకొస్తున్న 2.1 కిలోల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి శరీర అంతర్భాగంతో పాటు, లో దుస్తుల్లో అమర్చుకొని వచ్చిన నిందితులు అధికారుల కళ్లు కప్పాలని చూశారు, కానీ పాచిక పారలేదు. పట్టుబడిన బంగారం విలువ 1.27 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు.