చెన్నై విమానాశ్రయంలో దొరికిన ఇంటి దొంగలు … 13.5కిలోల బంగారం సీజ్
విమానాశ్రయాల్లో బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తూ స్మగ్లర్లకు లోపాయికారిగా సహకరిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.
ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది అరెస్టు
విధాత, హైదరాబాద్ : విమానాశ్రయాల్లో బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తూ స్మగ్లర్లకు లోపాయికారిగా సహకరిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చెన్నై విమానాశ్రయంలో ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది చేతివాటం గుర్తించిన కస్టమ్స్ అధికారులు అక్రమంగా రవాణ అవుతున్న 1.35కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో శ్రీలంక వాసితో పాటు అతడికి సహకరించిన ఇద్దరు విమానాశ్రయ సిబ్బందిని అరెస్టు చేశారు. దొరికిన బంగారం విలువ 8.5కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. సిబ్బంది సహకారంతోనే స్మగ్లింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram