100 Years Of NTR | 20 ఏళ్ల క్రితమే IT గురించి చెప్పిన వ్యక్తి చంద్రబాబు: సూపర్ స్టార్ రజనీకాంత్
100 Years Of NTR ఎన్టీయార్ శత జయంత్యుత్సవాలకు రజనీ బాలయ్య, చంద్రబాబు హాజరు ఎక్కడా కానరాని జూనియర్ ఎన్టీయార్ విధాత: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ విజయవాడ వచ్చారు. ఈ సభలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని రజనీకాంత్‌ను టీడీపీ నాయకత్వం ఆహ్వానించింది. విజయవాడ శివార్లలోని పోరంకిలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా పార్టీ అసెంబ్లీ మరియు […]

100 Years Of NTR
- ఎన్టీయార్ శత జయంత్యుత్సవాలకు రజనీ
- బాలయ్య, చంద్రబాబు హాజరు
- ఎక్కడా కానరాని జూనియర్ ఎన్టీయార్
విధాత: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ విజయవాడ వచ్చారు. ఈ సభలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని రజనీకాంత్‌ను టీడీపీ నాయకత్వం ఆహ్వానించింది. విజయవాడ శివార్లలోని పోరంకిలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా పార్టీ అసెంబ్లీ మరియు వెలుపల ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించింది. ఈ సారి, ఈవెంట్‌కు గ్లామర్ జోడించడానికి రజనీకాంత్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీ కాంత్ చంద్రబాబు ఒకే కార్లో వేదిక మీదకు వచ్చారు. బాలకృష్ణ సైతం రజనీతో ముచ్చటించడముతో సభావేదిక కళకళ లాడింది.
చంద్రబాబు 30ఏళ్ల నుంచి మిత్రుడు: రజనీకాంత్
చంద్రబాబు గారు నాకు 30ఏళ్ల నుంచి మిత్రుడు. దేశంలోని పెద్ద పెద్ద నేతలు అందరికీ చంద్రబాబు గారి విజన్ తెలుసు. 20 ఏళ్ల క్రితమే విజన్-2020 కి పునాది వేశారు. 20 ఏళ్ల క్రితమే ఐటీ డెవలప్మెంట్ గురించి చెప్పిన వ్యక్తి చంద్రబాబు.
ఇప్పుడు హైదరాబాద్ చూస్తే న్యూయార్క్ లో ఉన్నామా? ఇండియాలో ఉన్నామా అన్నట్టుగా అభివృద్ధి చెందింది అంటే, అది చంద్రబాబు గారి కృషి. ఆయన గెలిచినా, ఓడినా, ఎప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపిస్తూ ఉంటారు – ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్.
ఎక్కడా కానరాని జూనియర్!!
అయితే ఈ సభలో ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ వస్తున్నారు. ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు సలహా మేరకే 2009 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నారని అంటారు. అయితే, ఆ ప్రచారం నుంచి వస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కారుకు ప్రమాదం జరగడంతో తర్వాత ప్రచారం నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
టీడీపీలోనే కాదు, నందమూరి కుటుంబ కార్యక్రమాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. వాస్తవానికి జూనియర్ కు లోకేష్ కన్నా ఎక్కువ అభిమానులు ఉన్నారు.. ఇప్పటికే లోకేష్.. చంద్రబాబు సభల్లో కూడా కొందరు కార్యకర్తలు జూనియర్ ను తలుస్తూ ఫ్లెక్సీలు కట్టి ప్ల కార్డ్స్ ప్రదర్శించి చంద్రబాబు ఆగ్రహానికి గురైన సందర్భాలున్నాయి.
జూనియర్ కానీ టిడిపిలోకి వస్తె లోకేష్ కెరీర్ కు ఇబ్బంది వస్తుందన్న భయంతో ఆయన్ను దూరంగానే ఉంచుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ పార్టీ నేతల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీలోకి స్వాగతిస్తానని లోకేష్ ఇటీవలే అంగీకరించారు. మాట అయితే అనేశారు కానీ జూనియర్ ఎన్టీయార్ వస్తె పార్టీ క్యాడర్ మొత్తం ఆయన చుట్టూ చేరతారన్న భయం చంద్రబాబులో ఉండడంతో ఆయన్ను దూరం పెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ ఎన్టీయార్ సభకు కూడా జూనియర్ ను రాకుండా చేశారని ఇంటర్నల్ టాక్.