18 రోజుల్లో 13 మంది చిన్నారులు మృతి
విధాత: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 18 రోజుల్లో 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది. వివిధ అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజుల నుంచి 122 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో కొందరికి స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఆ యూనిట్‌లో చికిత్స పొందుతున్న నవజాత శిశువులకు వైద్యం అందించలేదు. విధులకు రావాల్సిన డాక్టర్ […]

విధాత: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 18 రోజుల్లో 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది. వివిధ అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజుల నుంచి 122 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో కొందరికి స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.
అయితే శనివారం రాత్రి ఆ యూనిట్‌లో చికిత్స పొందుతున్న నవజాత శిశువులకు వైద్యం అందించలేదు. విధులకు రావాల్సిన డాక్టర్ రాలేదు. ఆక్సిజన్ సపోర్ట్ కూడా లేకపోవడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మొత్తంగా 18 రోజుల్లో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ వరుస ఘటనల నేపథ్యంలో శిశువుల తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కిటికీలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని, ఆందోళనకారులను అదుపు చేశారు.
ఈ ఘటనపై ఒడిశా హెల్త్ మినిస్టర్ ఎన్ కే దాస్ స్పందించారు. చిన్నారులు చనిపోవడం దురదృష్ట కరమని పేర్కొన్నారు. శిశువుల మృతికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులు, నర్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎన్ కే దాస్ హెచ్చరించారు.