ఆ అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు
Gujarat Assembly | వరుసగా ఏడోసారి అధికారం చేజిక్కించుకున్న గుజరాత్ అసెంబ్లీలో 70 శాతం మంది ఎమ్మెల్యేలు కోటిశ్వరులే ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ సీట్లు 182 కాగా, 151 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. బీజేపీ నుంచి 156 ఎమ్మెల్యేలు గెలవగా 132 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలుపొందగా, 14 మంది రూ. కోటికి పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 156 మంది బీజేపీ ఎమ్మెల్యేల సగటు […]

Gujarat Assembly | వరుసగా ఏడోసారి అధికారం చేజిక్కించుకున్న గుజరాత్ అసెంబ్లీలో 70 శాతం మంది ఎమ్మెల్యేలు కోటిశ్వరులే ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ సీట్లు 182 కాగా, 151 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. బీజేపీ నుంచి 156 ఎమ్మెల్యేలు గెలవగా 132 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలుపొందగా, 14 మంది రూ. కోటికి పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 156 మంది బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ. 17.15 కోట్ల చొప్పున ఉన్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ. 5.51 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.
ఇక బీజేపీ ఎమ్మెల్యే జయంతి భాయి పటేల్ రూ. 661 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంత ఎమ్మెల్యే రికార్డుల్లోకి ఎక్కారు. మరో బీజేపీ ఎమ్మెల్యే కొకణి మోహన్ భాయి రూ. 18.56 లక్షలు ఆస్తులు కలిగి ఉన్నాడు. మోహన్ భాయి తక్కువ ఆస్తులు కలిగి ఉన్న ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో 94 శాతం మంది కోటీశ్వరులే.
మొత్తం ఎమ్మెల్యేల్లో 40 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ 40 మందిలో 29 మంది ఎమ్మెల్యేలపై నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. హత్యలు, కిడ్నాప్, అత్యాచారం వంటి కేసులను ఎదుర్కొంటున్నారు. బీజేపీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. మంత్రుల్లో 24 శాతం మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.