Odisha | విద్యార్థి మల ద్వారంలో ఇనుప గునపం.. అసలేం జరిగిందంటే..?
Odisha | ఓ విద్యార్థి మలద్వారంలోకి ఇనుప గునపం( Iron Rod ) చొచ్చుకుపోయింది. ఆ బాలుడికి వైద్యులు( Doctors ) నాలుగు గంటల పాటు సర్జరీ నిర్వహించి, ఆ ఇనుప గునపాన్ని బయటకు తీశారు. ఈ ఘటన ఒడిశా( Odisha )లోని కొంధమాల్ జిల్లా కోటగడ్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సువర్ణగిరి ప్రాంతానికి చెందిన సనాతన పటగురు కుమారుడు శక్తి పటగురు(16) శనివారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్కడ తరగతి […]

Odisha | ఓ విద్యార్థి మలద్వారంలోకి ఇనుప గునపం( Iron Rod ) చొచ్చుకుపోయింది. ఆ బాలుడికి వైద్యులు( Doctors ) నాలుగు గంటల పాటు సర్జరీ నిర్వహించి, ఆ ఇనుప గునపాన్ని బయటకు తీశారు. ఈ ఘటన ఒడిశా( Odisha )లోని కొంధమాల్ జిల్లా కోటగడ్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సువర్ణగిరి ప్రాంతానికి చెందిన సనాతన పటగురు కుమారుడు శక్తి పటగురు(16) శనివారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్కడ తరగతి గదులపై( Class Rooms ) ఉన్న సిమెంట్ రేకులు తొలగిస్తున్నాడు శక్తి పటగురు. ఓ రేకు విరిగిపోవడంతో బాలుడు ప్రమాదవశాత్తు జారాడు. అదే సమయంలో అక్కడ మరో వ్యక్తి పొడవైన ఇనుప గునపాన్ని పట్టుకుని నిల్చున్నాడు. ఆ ఇనుప గునపం.. బాలుడి మలద్వారంలోకి చొచ్చుకెళ్లింది. దీంతో హుటాహుటిన అతన్ని చికిత్స నిమిత్తం ఎమ్‌కేసీజీ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు శస్త్ర చికిత్స నిర్వహించి, ఇనుప రాడ్‌ను తొలగించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.