Mizoram | కూలిన రైల్వే బ్రిడ్జి.. 17 మంది దుర్మరణం
మిజోరాంలో నిర్మిస్తుండగా దుర్ఘటన కొనసాగుతున్న సహాయ చర్యలు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం క్షతగాత్రులకు రూ.50వేల చొప్పన ఎక్స్‌గ్రేషియా Mizoram | విధాత: మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మరణించారు. కూలిన బ్రిడ్జి కింద చాలా మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వంతెన కూలిపోయిన సమయంలో దాదాపు 35 నుంచి 40 మంది కార్మికులు […]

- మిజోరాంలో నిర్మిస్తుండగా దుర్ఘటన
- కొనసాగుతున్న సహాయ చర్యలు
- ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
- క్షతగాత్రులకు రూ.50వేల చొప్పన ఎక్స్‌గ్రేషియా
Mizoram | విధాత: మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మరణించారు. కూలిన బ్రిడ్జి కింద చాలా మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వంతెన కూలిపోయిన సమయంలో దాదాపు 35 నుంచి 40 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరాంగ్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీ తీవ్ర విచారం
ఈ దుర్ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.