BJP | మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ బీజేపీ తొలి జాబితా వెల్లడి
ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు ఐదు రాష్ట్రాల ఎన్నికల సన్నాహాల్లో కమలదళం జోరు BJP | విధాత: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల దిశగా బీజేపీ సెంట్రల్ కమిటీ మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లకు సంబంధించి తొలి జాబితాను ప్రకటించింది. గురువారం ఢిల్లీలో భేటీయైన పార్టీ సీఈసీ మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సన్నాహాలపై చర్చించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర […]
- ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు
- ఐదు రాష్ట్రాల ఎన్నికల సన్నాహాల్లో కమలదళం జోరు
BJP | విధాత: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల దిశగా బీజేపీ సెంట్రల్ కమిటీ మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లకు సంబంధించి తొలి జాబితాను ప్రకటించింది. గురువారం ఢిల్లీలో భేటీయైన పార్టీ సీఈసీ మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సన్నాహాలపై చర్చించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రభృతులు సీఈసీ భేటీకి హాజరై ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
Glimpses from BJP Central Election Committee Meeting being held at party headquarters in New Delhi. pic.twitter.com/gRx8eIZfXg
— BJP (@BJP4India) August 16, 2023
అనంతరం మధ్యప్రదేశ్‌కు సంబంధించి 39మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను, అలాగే చత్తీస్ ఘడ్ 21మంది అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ నాయకత్వం ప్రకటించింది. చత్తీస్‌ఘడ్‌లో 90అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 230అసెంబ్లీ స్థానాలున్నాయి. పార్టీ అభ్యర్థుల తదుపరి జాబితాలను వరుస క్రమంలో వెల్లడించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన ఓటమి నేపధ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం త్వరలో జరుగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటుంది.
भाजपा केन्द्रीय चुनाव समिति ने छत्तीसगढ़ एवं मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। (2/2) pic.twitter.com/VsjOfj3DVe
— BJP (@BJP4India) August 17, 2023
ఆ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. మిజోరాంలో బీజేపీ అలయెన్స్ అధికారంలో ఉంది. దీంతో మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ గెలువాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో విజయం సాధించడం ద్వారా మేలో జరుగాల్సిన పార్లమెంటు ఎన్నికలకు విజయంపై ధీమాతో వెళ్లాలని బీజేపీ భావిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram