జాతీయ జన గణనలో ఓబీసీల కాలమ్ ఎక్కడా? : కవిత ధ్వజం

జాతీయ జనగణన కులగణన డాక్యుమెంట్‌లో ఓబీసీ కాలమ్ లేకపోవడం బీజేపీ మోసమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు.

జాతీయ జన గణనలో ఓబీసీల కాలమ్ ఎక్కడా? : కవిత ధ్వజం

విధాత, హైదరాబాద్ : జాతీయ జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన డాక్యుమెంట్ లో ఎస్సీ, ఎస్టీ ల కాలమ్ పెట్టినప్పటికి ఓబీసీ కాలమ్ లేకుండా కులం అనే కాలమ్ మాత్రమే పెట్టి బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జన గణనలో కులగణన – సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ప్రారంభోపన్యాసం చేశారు. దేశ వ్యాప్తంగా జనగణన, కులగణన పై ఎక్సర్ సైజ్ జరుగుతోందని, నిజానికి పదేళ్ల కు ఒకసారి జనగణన చేయాల్సి ఉండగా..కరోనా కారణంగా 2021 లో జనగణన చేయలేదన్నారు. కులగణన పై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ రావటంతో కేంద్రం అందుకు అంగీకరించడం సంతోష పరిచినప్పటికి డాక్యుమెంట్ విడుదల తర్వతా బీజేపీ మోసపూరిత బుద్ది బయటపడిందని విమర్శించారు. జనగణన చేసినప్పుడే ఏ వర్గం ఎంత ఉంది? వారికి బడ్జెట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుందన్నారు. 2011లో రూ. 4500 కోట్లతో కాంగ్రెస్ జనగణనలో ఏ తప్పు చేసిందో బీజేపీ కూడా అదే చేస్తోంది అని, రూ.11 వేల కోట్లు పెట్టి బీజేపీ చేపట్టబోయే జనగణనలో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోంది అని కవిత ఆరోపించారు.

కులగణనపై ప్రక్రియ ప్రతిపార్టీ స్టాండ్ చెప్పాలి

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా కులాలకు గుర్తింపు ఉందని, 56 శాతం ఉన్న బీసీల విషయంలో మరింత గందరగోళం కొనసాగుతుందని, గతంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారని..వాళ్లు ఏ కేటగిరీలో వస్తారో చెప్పలేదు అన్ని కవిత తప్పుబట్టారు. కులగణన అంశంలో ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో ఏమీ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉందన్నారు. బీజేపీయే డాక్యుమెంట్ విడుదల చేసినందునా.. వాళ్లు ఆ డాక్యుమెంట్ గా మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు. అన్ని పార్టీలు కూడా కేంద్రం చేపట్టనున్న కులగణన తీరుపై తమ స్టాండ్ ఏంటో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఉన్న కులాలు, వాటి ఉపకులాల నివేదిక జాగృతి సిద్ధం చేస్తుంది అని కవిత తెలిపారు. నిజానికి ఈ పని ప్రభుత్వమే చేయాలి. కానీ వాళ్లకు చిత్తశుద్ది లేదు అని విమర్శించారు. అందుకే మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అందరి ఒపీనియన్స్ తీసుకోవాలని నిర్ణయించాం అన్నారు. తెలంగాణ థింక్స్, ఇండియా ఫాలోస్ నెక్స్ట్ అనే విధంగా మనం ఉంటాం అని, కులగణన విషయంలోనూ మనం అదే విధంగా నివేదికను కేంద్రానికి ఇద్దాం అని కవిత సూచించారు. ప్రతి కులానికి అన్ని హక్కులు సాధించుకునేలా ప్రయత్నం చేద్దాం అన్నారు.

ఇవి కూడా చదవండి :

Nepali Couple Robs 18Cr: అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు.. రూ.18 కోట్లతో ఉడాయించిన నేపాలీ జంట
Amazon LayOffs : ఊహించినట్టే జరిగింది.. 16 వేల మందిపై వేటు వేసిన అమెజాన్‌