ఆ 21 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
విధాత : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నాయకులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ఈడీ దాడులు చేయిస్తున్నప్పటికీ సీఎం మమతా బెనర్జీ బెదరడం లేదు. మరో ఆరు నెలల్లో మమత ప్రభుత్వం కూలుతుందని బీజేపీ లీడర్ మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో 21 మంది ఎమ్మెల్యేలుగా నేరుగా టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మొత్తం […]

విధాత : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నాయకులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ఈడీ దాడులు చేయిస్తున్నప్పటికీ సీఎం మమతా బెనర్జీ బెదరడం లేదు.
మరో ఆరు నెలల్లో మమత ప్రభుత్వం కూలుతుందని బీజేపీ లీడర్ మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో 21 మంది ఎమ్మెల్యేలుగా నేరుగా టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉండగా, అందులో 21 మంది తనతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.
ఇప్పుడు చెప్తున్నాను. గతంలో చెప్పారు. కొంచెం సమయం వేచి చూడండి.. బెంగాల్‌లో ఏం జరగబోతుందో మీరే చూస్తారని మిథున్ చక్రవర్తి పేర్కొన్నారు. టీఎంసీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కొందరు ఆసక్తి చూపడం లేదని, ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఇక బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. ఆరు నెలలు కూడా తృణమూల్ ప్రభుత్వం కొనసాగదని పేర్కొన్నారు.
2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 77 సీట్లలో మాత్రమే గెలుపొందింది. బెంగాల్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 294.