Fire Accident | ఆస్పత్రిలో ఎగిసిపడ్డ అగ్నికీలలు.. 21 మంది రోగులు మృతి
Fire Accident | చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని ఓ ఆస్పత్రిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో 21 మంది రోగులు సజీవదహనం అయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. బీజింగ్‌లోని చాంగ్‌ఫెంగ్ ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తూనే, […]

Fire Accident | చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని ఓ ఆస్పత్రిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో 21 మంది రోగులు సజీవదహనం అయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. బీజింగ్‌లోని చాంగ్‌ఫెంగ్ ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తూనే, సహాయక చర్యలు చేపట్టింది. సురక్షితంగా 71 మంది రోగులను బయటకు తీసుకొచ్చింది. ఇందులో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ అగ్నికీలలు ఎగిసిపడటంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
చాలా మంది రోగులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీల్లోంచి బయటకు వచ్చి గోడలకు అమర్చిన ఏసీలపై నిలబడ్డారు. వారిలో కొందరు కిందకు దూకారు అని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.