Himachal | హిమాచల్‌లో 250 రహదారులు బంద్
Himachal కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు బంద్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు విధాత: ఉత్తరాదిన కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అనేక వ్యవస్థలను వరదలు ధ్వంసం చేశాయి. ముఖ్యంగా రహదారులు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. రాష్ట్రంలో మొత్తం దాదాపు 3,700 మార్గాలు ఉండగా, 1200 మార్గాలు ధ్వంసమయ్యాయని హిమాచల్ ప్రదేశ్ రోడ్, ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీ రోహన్ చంద్ ఠాకూర్ తెలిపారు. గత 24 గంటల్లో పరిస్థితి […]

Himachal
- కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు బంద్
- ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
విధాత: ఉత్తరాదిన కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అనేక వ్యవస్థలను వరదలు ధ్వంసం చేశాయి. ముఖ్యంగా రహదారులు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. రాష్ట్రంలో మొత్తం దాదాపు 3,700 మార్గాలు ఉండగా, 1200 మార్గాలు ధ్వంసమయ్యాయని హిమాచల్ ప్రదేశ్ రోడ్, ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీ రోహన్ చంద్ ఠాకూర్ తెలిపారు. గత 24 గంటల్లో పరిస్థితి కొంత మెరుగుపడిందని అన్నారు.
#WATCH | “We have about 3,700 total routes. If we talk about today, the operation of around 1,200 routes is suspended. The majority of them are in the Kullu district…rest are from Mandi, upper Shimla and tribal areas. The good thing is, in the past 24 hours around 250 routes… pic.twitter.com/4HAnP15QH0
— ANI (@ANI) July 13, 2023
గురువారం ఈ 1200 మార్గాల్లో మరమ్మతు చర్యలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. వీటిలో ఎక్కువ కులు జిల్లా, మండి, ఎగువ సిమ్లా, గిరిజన ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంతోషకరమైన విషయం ఏమిటంటే గడిచిన 24 గంటల్లో దాదాపు 250 మార్గాల్లో రాకపోకలను పునరుద్ధరించామని వెల్లడించారు. గురువారం సాయంత్రానికి దాదాపు 200-250 రూట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. బుధవారం వరకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో దాదాపు 615 బస్సులు నిలిచిపోయాయని, గురువారం 316 బస్సులు నిలిచిపోయాయని వివరించారు.