Billionaires | ఆ ఎంపీలు.. శతకోటీశ్వరులు! 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 27 మంది అల్ట్రా రిచ్

Billionaires | 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 27 మంది అల్ట్రా రిచ్ అత్యధికులు ఏపీలోని వైసీపీ వారే ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 225 మంది సభ్యుల్లో 27 మంది శతకోటీశ్వరులని ఒక నివేదిక వెల్లడించింది. వీరిలో ఆరుగురు బీజేపీకి చెందినవారు. మొత్తంగా రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తి 80.93 కోట్లుగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) పేర్కొన్నాయి. 225 మంది రాజ్యసభ […]

Billionaires | ఆ ఎంపీలు.. శతకోటీశ్వరులు! 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 27 మంది అల్ట్రా రిచ్

Billionaires |

  • 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 27 మంది అల్ట్రా రిచ్
  • అత్యధికులు ఏపీలోని వైసీపీ వారే
  • ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 225 మంది సభ్యుల్లో 27 మంది శతకోటీశ్వరులని ఒక నివేదిక వెల్లడించింది. వీరిలో ఆరుగురు బీజేపీకి చెందినవారు. మొత్తంగా రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తి 80.93 కోట్లుగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) పేర్కొన్నాయి. 225 మంది రాజ్యసభ సభ్యుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను ఈ సంస్థలు అధ్యయనం చేశాయి.

రాజ్యసభలో ఒక సీటు ఖాళీగా ఉన్నదని, ముగ్గురు ఎంపీల అఫిడవిట్లు లభ్యంకాలేదని తెలిపాయి. జమ్ముకశ్మీర్‌కు చెందిన నలుగురు ఎంపీల అఫిడవిట్లు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నాయి. వందకోట్లకు మించి ఆస్తులున్నవారిలో ఏపీకి చెందిన వైసీపీ ఉండగా.. తదుపరి స్థానంలో బీజేపీ నిలిచింది.

బీజేపీకి 85 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే..అందులో ఆరుగురు (7%) శతకోటీశ్వరులు. కాంగ్రెస్‌కు ఉన్న 30 మందిలో నలుగురు (13%), వైసీపీకి ఉన్న 9 మందిలో నలుగురు (44%), ఆప్‌కు ఉన్న పది మందిలో ముగ్గురు (30%), టీఆర్‌ఎస్‌కు ఉన్న ఏడుగురిలో ముగ్గురు (43%), ఆర్జేడీ ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు (33%) తమకు వందకోట్లకు మించిన ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లలో వెల్లడించారు.

ఏపీ టాప్

వందకోట్లకు మించిన ఆస్తులు ఉన్నవారిలో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌ పొజిషన్‌లో ఉన్నది. తర్వాతి రెండు స్థానాల్లో తెలంగాణ, మహారాష్ట్ర నిలిచాయి. ఏపీకి చెందిన 11 మంది ఎంపీల్లో ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే.

తెలంగాణ నుంచి ఏడుగురు ఉంటే.. అందులో ముగ్గురు, మహారాష్ట్ర 19 మంది ఎంపీల్లో ముగ్గురు, ఢిల్లీ నుంచి ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకరు, పంజాబ్‌ నుంచి ఏడుగురు ఎంపీలు ఉంటే.. ఇద్దరు, హర్యానా నుంచి ఐదుగురు ఉంటే.. ఒకరు, మధ్యప్రదేశ్‌ నుంచి ఉన్న 11 మంది ఎంపీల్లో ఇద్దరు తమకు వంద కోట్లపైనే ఉన్నాయని వెల్లడించారు.

రాజ్యసభ సిటింగ్‌ సభ్యుల సగటు ఆస్తి 80.93 కోట్లుగా లెక్కగట్టారు. బీఆరెస్‌కు చెందిన డాక్టర్‌ బండి పార్థసారథి అత్యంత సంపన్న ఎంపీగా ఉంటే.. పంజాబ్‌కు చెందిన సంత్‌ బల్బీర్‌సింగ్‌ పేద ఎంపీగా ఉన్నారు. పరిమళ నత్వాల్‌ అత్యంత ఎక్కువ అప్పులు ఉన్న ఎంపీగా నిలిచారు.