Earthquake | రాజ‌స్థాన్‌లో భూకంపం.. నిద్ర‌లోనే ఉలిక్కిప‌డ్డ జ‌నాలు

Earthquake | రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున భూకంపం సంభ‌వించింది. అర గంట స‌మ‌యంలోనే వ‌రుస‌గా మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ప్ర‌జ‌లు నిద్ర‌లోనే ఉలిక్కిప‌డ్డారు. కొంద‌రైతే త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. గాఢ నిద్ర‌లో ఉన్న‌ప్పుడు భూమి ఒక్క‌సారిగా కంపించ‌డంతో ప్ర‌జ‌లంతా ఏం జ‌రుగుతుందో తెలియ‌క భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 4.09 గంట‌ల‌కు భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 4.4గా న‌మోదైంది. 4.25 గంట‌ల‌కు […]

Earthquake | రాజ‌స్థాన్‌లో భూకంపం.. నిద్ర‌లోనే ఉలిక్కిప‌డ్డ జ‌నాలు

Earthquake | రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున భూకంపం సంభ‌వించింది. అర గంట స‌మ‌యంలోనే వ‌రుస‌గా మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ప్ర‌జ‌లు నిద్ర‌లోనే ఉలిక్కిప‌డ్డారు. కొంద‌రైతే త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. గాఢ నిద్ర‌లో ఉన్న‌ప్పుడు భూమి ఒక్క‌సారిగా కంపించ‌డంతో ప్ర‌జ‌లంతా ఏం జ‌రుగుతుందో తెలియ‌క భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 4.09 గంట‌ల‌కు భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 4.4గా న‌మోదైంది. 4.25 గంట‌ల‌కు భూమి కంపించ‌గా, తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.4గా న‌మోదైంది. 4.22 గంట‌ల‌కు మ‌రోసారి భూకంపం సంభ‌వించింది. 3.1గా తీవ్ర‌త న‌మోదైంది. ఈ భూకంప ధాటికి ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు నిర్ధారించారు.
రాజ‌స్థాన్ మాజీ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజె ఈ భూకంపం గురించి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. జైపూర్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో సైతం భూకంపం సంభ‌వించిన‌ట్లు ఆమె తెలిపారు.