Manipur | మణిపూర్ లో ముగ్గురు కుకీల కాల్చివేత
Manipur | ఇంఫాల్: శుక్రవారం తెల్లవారు జామున సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు కుకీ-జోమీలు చనిపోయారు. ఈ ఘటన తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో కుకీల గ్రామం థోవాయిలో చోటుచేసుకున్నది. థోవాయి కుకీలు బహుళ సంఖ్యలో వున్న టాంగ్ ఖుల్లో భాగం. నాగాల ఆధిక్యతలోని ఉఖ్రుల్ జిల్లాలో ఈ ప్రాంతమంతా కలిసి వుంటుంది. మణిపూర్లో హింస ప్రారంభమైనప్పటి నుంచీ దాదాపు ఈ జిల్లా శాంతియుతంగానే వుంది. తాజా ఘటనతో ప్రజల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. చనిపోయిన […]

Manipur | ఇంఫాల్: శుక్రవారం తెల్లవారు జామున సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు కుకీ-జోమీలు చనిపోయారు. ఈ ఘటన తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో కుకీల గ్రామం థోవాయిలో చోటుచేసుకున్నది. థోవాయి కుకీలు బహుళ సంఖ్యలో వున్న టాంగ్ ఖుల్లో భాగం. నాగాల ఆధిక్యతలోని ఉఖ్రుల్ జిల్లాలో ఈ ప్రాంతమంతా కలిసి వుంటుంది. మణిపూర్లో హింస ప్రారంభమైనప్పటి నుంచీ దాదాపు ఈ జిల్లా శాంతియుతంగానే వుంది.
తాజా ఘటనతో ప్రజల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. చనిపోయిన వారిని థాంగ్ ఖోకైయి హయకిప్, జమ్ ఖోగిన్ హాయకిప్, హాల్లేన్ సన్ బైతేగా గుర్తించామని జిల్లా ఎస్పీ నింగ్ శెమ్ వాషుమ్ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో వీరు ఆ గ్రామ రక్షణ భాధ్యతల్లో ఉన్నారు. ఈ గ్రామం కొండల్లో దూరంగా వుంది. మూడు కిలోమీటర్ల పరిధిలో పోలీసు స్టేషన్ వుంది. దీన్ని ఆసరాగా తీసుకొని దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్టు భావిస్తున్నారు. అయితే దుండగుల కోసం పోలీసులు సమీప ప్రాంతాలను జల్లెడపడుతున్నారు.