Haryana violence | నివురు కప్పిన నిప్పులా నుహ్!
ఇప్పటికీ ఉద్రిక్తంగా, క్లిష్టంగా పరిస్థితి ఆదివారం వరకు నగరంలో మొబైల్ ఇంటర్నెట్ ఎస్ఎంఎస్ సేవలు బంద్ ఇప్పటివరకు 393 మంది అరెస్టు 160 ఎఫ్ఐఆర్‌లు నమోదు Haryana violence | విధాత: హర్యానాలోని నుహ్ (Nuh) లో విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ) విద్వేషయాత్ర రాజేసిన మంటలు నేటికీ చల్లాడం లేదు. నుహ్ జిల్లా కేంద్రంలో అల్లర్లు మొదలై పది రోజులు దాటినా పరిస్థితి ఇంకా నివురు కప్పిన నిప్పులా ఉన్నది. ఇప్పటికీ నుహ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా, క్లిష్టంగానే […]
- ఇప్పటికీ ఉద్రిక్తంగా, క్లిష్టంగా పరిస్థితి
- ఆదివారం వరకు నగరంలో మొబైల్
- ఇంటర్నెట్ ఎస్ఎంఎస్ సేవలు బంద్
- ఇప్పటివరకు 393 మంది అరెస్టు
- 160 ఎఫ్ఐఆర్‌లు నమోదు
Haryana violence | విధాత: హర్యానాలోని నుహ్ (Nuh) లో విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ) విద్వేషయాత్ర రాజేసిన మంటలు నేటికీ చల్లాడం లేదు. నుహ్ జిల్లా కేంద్రంలో అల్లర్లు మొదలై పది రోజులు దాటినా పరిస్థితి ఇంకా నివురు కప్పిన నిప్పులా ఉన్నది. ఇప్పటికీ నుహ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా, క్లిష్టంగానే ఉన్నది. ఈ నేపథ్యంలో నుహ్‌లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవల బంద్‌ను హర్యానా ప్రభుత్వం శుక్రవారం వరకు పొడిగించింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు హర్యానా ప్రభుత్వం వెల్లడించింది.
ఈ నెల ప్రారంభంలో వీహెచ్‌పీ యాత్ర సందర్భంగా నుహ్‌లో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిన అల్లర్ల నేపథ్యంలో ఇప్పటివరకు 393 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 118 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. నుహ్, గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్, రెవారీ, పానిపట్, భివానీ, హిసార్‌లలో 160 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఈ విషయాన్ని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ శుక్రవారం వెల్లడించారు. అయితే, హర్యానాలోని బీజేపీ-జేజేపీ ప్రశాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు హర్యానా ప్రభుత్వం వైఫల్యం కారణంగానే నుహ్‌లో హింస జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram