G20 | ఐటీసీ మౌర్య‌లో జో బైడెన్ కోసం 400 గ‌దులు.. జీ-20 స‌ద‌స్సు నేప‌థ్యంలో దేశాధ్య‌క్షుల‌కు హోట‌ళ్ల బుకింగ్

G20 | విధాత‌: వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న జీ-20 (G-20) స‌మావేశాల‌కు దిల్లీ (Delhi) సిద్ధ‌మ‌వుతోంది. అగ్రరాజ్యం అమెరికా (Ameria) అధ్య‌క్షుడు జో బైడెన్‌, చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ సహా ప‌లువురు దేశాధినేత‌లు, నిపుణులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు. సెప్టెంబ‌రు 9, 10 తేదీల‌లో జ‌రిగే ప్ర‌ధాన స‌మావేశాల్లో ప‌లు అంశాల‌పై దేశాధినేత‌లంద‌రూ స‌మాలోచ‌న‌లు జ‌రుపుతారు. వీరంద‌రి బ‌స కోసం స్టార్ హోట‌ళ్ల‌ను అధికారులు బుక్ చేస్తున్నారు. ఐటీసీ మౌర్య‌, తాజ్ […]

G20 | ఐటీసీ మౌర్య‌లో జో బైడెన్ కోసం 400 గ‌దులు.. జీ-20 స‌ద‌స్సు నేప‌థ్యంలో దేశాధ్య‌క్షుల‌కు హోట‌ళ్ల బుకింగ్

G20 | విధాత‌: వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న జీ-20 (G-20) స‌మావేశాల‌కు దిల్లీ (Delhi) సిద్ధ‌మ‌వుతోంది. అగ్రరాజ్యం అమెరికా (Ameria) అధ్య‌క్షుడు జో బైడెన్‌, చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ సహా ప‌లువురు దేశాధినేత‌లు, నిపుణులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు.

సెప్టెంబ‌రు 9, 10 తేదీల‌లో జ‌రిగే ప్ర‌ధాన స‌మావేశాల్లో ప‌లు అంశాల‌పై దేశాధినేత‌లంద‌రూ స‌మాలోచ‌న‌లు జ‌రుపుతారు. వీరంద‌రి బ‌స కోసం స్టార్ హోట‌ళ్ల‌ను అధికారులు బుక్ చేస్తున్నారు. ఐటీసీ మౌర్య‌, తాజ్ ప్యాల‌స్‌, ద ఒబెరాయ్‌, ద లోధీ, ద ఇంపీరియ‌ల్‌, లె మెరీడియ‌న్ హోట‌ళ్ల‌లో ఇప్ప‌టికే రూంలు బుక్ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం.

ఐటీసీ మౌర్య‌లో బ‌స చేయ‌నున్న జో బైడెన్ కోసం ఆ హోట‌ల్‌లో 400 రూంలు బుక్ చేశారు. అదే హోట‌ల్‌లో గ‌తంలో అమెరికా మాజీ అధ్య‌క్షులు జార్జ్ బుష్‌, బిల్ క్లింట‌న్‌, ఒబామా త‌దిత‌రులు బ‌స చేయడం విశేషం. ఇప్ప‌టికే అమెరికా నిఘా వ‌ర్గాలు హోట‌ల్ ప‌రిస‌రాల‌ను జ‌ల్లెడ ప‌డుతున్నాయి.

మ‌రోవైపు చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్ తాజ్ హోట‌ల్‌లో ఆతిథ్యం పొందే అవ‌కాశ‌ముంది. భార‌త సంత‌తి యూకే ప్ర‌ధాని రుషీ సునాక్, జ‌ర్మ‌నీ స‌హ‌చ‌రుల‌తో క‌లిసి షంగ్రీ లా హోట‌ల్‌లో బ‌స చేస్తారు. క్లారిడ్జ్ హోట‌ల్‌లో ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌, ఇంపీరియ‌ల‌ల్ హోట‌ల్‌లో ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ ఆల్బ‌నీస్ త‌దిత‌రులు ఉండ‌నున్నారు.

స‌ద‌స్సు జ‌ర‌గనున్న సెప్టెంబ‌రు 8 నుంచి 10 వ‌ర‌కు అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్యాల‌యాల‌ను మూసివేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు చేసిన విజ్ఞ‌ప్తికి దిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ అంగీక‌రించారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవే కాకుండా రాజ‌ధాని ప్రాదేశిక ప‌రిధిలో అన్ని పాఠ‌శాలలు, క‌ళాశాల‌లకు సెల‌వులకు ఆ నాలుగు రోజులు ప్ర‌క‌టించ‌నున్నారు.