అక్టోబర్‌ నుంచి కొత్త నిబంధనలు..! మరి ఈ పనులు పూర్తి చేశారా..? లేకుంటే సమస్యలు తప్పవ్‌..!

అక్టోబర్‌ నుంచి కొత్త నిబంధనలు..! మరి ఈ పనులు పూర్తి చేశారా..? లేకుంటే సమస్యలు తప్పవ్‌..!

విధాత సెప్టెంబర్‌ మాసం మరో వారంలో ముగియనున్నది. అక్టోబర్‌ నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన నిబంధనలు మారాయి. ఈ క్రమంలో వాటిని ఈ నెల 30లోగా పూర్తి చేయాల్సిందే. టీసీఎస్‌ నిబంధనలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ నామినీల ఎంపిక తదితర నింబధనలు మారాయి. పెనాల్టీలు, ఛార్జీలు అంటూ చాలా వరకు ఖర్చు చేయాల్సి రానున్నది. పన్ను సంబంధిత విషయాల్లో జరిమానాలు, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఏయే పనులను పూర్తి చేయాలో తెలుసుకుందాం రండి..!

మ్యూచువల్ ఫండ్స్‌ నామినీలు..

చాలా మంది స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే వారు తమ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫొలియోలకు నామినీలను జత చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లాస్ట్‌ డే ఈ నెల 30వ తేదీ. ఈలోగా మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫొలియోలకు నామినీలను లింక్‌ చేయాల్సిందే. లేకపోతే అకౌంట్లు ఫ్రీజ్‌ కానున్నాయి.

టీసీఎస్‌ నిబంధనలు మారాయ్‌..

భారత్‌లో తీసుకున్న క్రెడిట్ కార్డును విదేశాల్లో రూ.7 లక్షలకు మించి లావాదేవీలు జరిపినట్లయితే ఆ అదనపు మొత్తంపై 20శాతం టీసీఎస్‌ విధించనున్నారు. రూ.7లక్షల వరకు ఎలాంటి టీసీఎస్‌ ఉండదు. అక్టోబర్‌ ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. అయితే, వైద్య ఖర్చులు, చదువుల నిమిత్తం వినియోగించినట్లయితే రూ.7లక్షలకు మంచిన మొత్తంపై కేవలం 5శాతమే వసూలు చేస్తారు. విదేశీ విద్య కోసం రుణం తీసుకున్నవారు రూ.7 లక్షలకు మించిన మొత్తంపై కేవలం 0.5శాతం టీసీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది.

డీమ్యాట్ అకౌంట్స్‌కు నామినీలు..

స్టాక్ మార్కెట్‌లో డీమ్యాట్ ఖాతాల ద్వారా ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన డీమ్యాట్ అకౌంట్లకు నామినీలను జత చేయాల్సి ఉంటుంది. ఇందుకు గడువు సెప్టెంబర్‌ 30వ తేదీ. ఈలోగా నామినీని యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా ఖాతాలను ఫ్రీజ్‌ చేయనున్నారు. ఈ విషయంపై సెబీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి గడువును మార్చి 31లోగా ముగియాల్సి ఉండగా.. సెప్టెంబర్‌ వరకు సెబీ గడువు పొడిగించింది. ఇప్పటికే డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లకు నామినీలను జత చేయాల్సిన వారు మళ్లీ చేసుకోవాల్సిన పని లేదు.

ఆ ఖాతాలకు ఆధార్ లింక్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ తదితర స్మాల్ సేవింగ్స్ పథకాల లబ్ధిదారులు ఆయా ఖాతాలకు ఆధార్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆఖరి తేదీ సెప్టెంబర్‌30. ఆలోగా ఆధార్‌ లింక్‌ చేయకపోతే స్మాల్ సేవింగ్స్ ఖాతాల లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆధార్‌ను లింక్‌ చేసిన వారు మళ్లీ ఆధార్‌ లింక్‌ చేయాల్సి అవసరం లేదు.

రూ.2000 నోట్ల మార్పిడికి..

ఆర్‌బీఐ రూ.2000నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయా నోట్ల మార్పిడి, డిపాజిట్లకు ఈ నెల 30 వరకు గడువును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. అయితే, ఇంకా ఎవరి వద్దనైనా రూ.2వేల నోట్ల ముగిలిపోతే వెంటనే దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్లి మార్చుకోండి. లేదంటే మీకు అకౌంట్‌ ఉన్న బ్యాంకుకు వెళ్లి డిపాజిట్‌ చేసుకోవాలి. ఇక సెప్టెంబర్‌ 30 తర్వాత ఆ నోట్లు చెల్లబోవని, నోట్లు ఉంటే నేరంగా పరిగణించనున్నట్లు ఆర్‌బీఐ హెచ్చరించింది.