పిడుగుపాటుకు బాలుడు, 40 గొర్రెలు మృతి

విధాత: గురువారం సాయంత్రం ఆకస్మికంగా వర్షాలతో ఏపీ మాచర్ల మండలం చింతలతండాకు చెందిన రమావత్ సైదా(17),  40 గొర్రెల మృతి చెందాయి. గొర్రెలను మేపేందుకు నాగార్జున సాగర్ ఎయిర్ పోర్ట్ సమీపంలో పొలాల్లోకి తీసుకెళ్లగా ఆకస్మిక వర్షంతో పాటు పిడుగు పడటంతో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పిడుగుపాటు ధాటికి పొలంలో మేపుకు వెళ్లిన గొర్రెలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి త‌మ కుమారుడు, ఒకేసారి 40 మేక‌లు మృతి చెందడంతో వాటితోనే జీవనం సాగిస్తున్న రైతు కుటుంబంలో […]

  • By: Somu    latest    Mar 16, 2023 12:33 PM IST
పిడుగుపాటుకు బాలుడు, 40 గొర్రెలు మృతి

విధాత: గురువారం సాయంత్రం ఆకస్మికంగా వర్షాలతో ఏపీ మాచర్ల మండలం చింతలతండాకు చెందిన రమావత్ సైదా(17), 40 గొర్రెల మృతి చెందాయి. గొర్రెలను మేపేందుకు నాగార్జున సాగర్ ఎయిర్ పోర్ట్ సమీపంలో పొలాల్లోకి తీసుకెళ్లగా ఆకస్మిక వర్షంతో పాటు పిడుగు పడటంతో గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

పిడుగుపాటు ధాటికి పొలంలో మేపుకు వెళ్లిన గొర్రెలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి త‌మ కుమారుడు, ఒకేసారి 40 మేక‌లు మృతి చెందడంతో వాటితోనే జీవనం సాగిస్తున్న రైతు కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.