Private Jet Crashes | కూలిన ప్రైవేట్ జెట్.. ఆరుగురు దుర్మరణం
Private Jet crashes | కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆ జెట్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. విమానం పూర్తిగా కాలిపోయింది. లాస్ వేగాస్ నుంచి బయల్దేరిన విమానం.. ఫ్రెంచ్ వ్యాలీ ఎయిర్‌పోర్టుకు సమీపంలో కూలిపోయింది. రన్‌వేకు 300 అడుగుల దూరంలో.. ఎయిర్‌పోర్టు గ్రౌండ్ వెలుపల ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానం కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి పైలట్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న […]

Private Jet crashes | కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆ జెట్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. విమానం పూర్తిగా కాలిపోయింది.
లాస్ వేగాస్ నుంచి బయల్దేరిన విమానం.. ఫ్రెంచ్ వ్యాలీ ఎయిర్‌పోర్టుకు సమీపంలో కూలిపోయింది. రన్‌వేకు 300 అడుగుల దూరంలో.. ఎయిర్‌పోర్టు గ్రౌండ్ వెలుపల ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానం కూలిపోయింది.
దీంతో మంటలు చెలరేగి పైలట్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కాలి బూడిదయ్యారు. కేవలం విమానం తోక మాత్రమే కాలలేదు. విమానం ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఏవియేషన్ అధికారులు నిర్ధారించారు.