Sydney | సిడ్నీలో ఘోరం.. దుండ‌గుడి చేతిలో ఆరుగురు దుర్మరణం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ న‌గ‌రంలో శనివారంనాడు ఘోరం చోటుచేసుకుంది.

  • Publish Date - April 13, 2024 / 05:20 PM IST

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ న‌గ‌రంలో శనివారంనాడు ఘోరం చోటుచేసుకుంది. హ‌ఠాత్తుగా ఒక షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేయ‌డంతో ఆరుగురు మృతిచెందారు. ఈ దాడిలో ఒక చిన్నారి తో సహా పలువురు గాయపడ్డారు. స‌మాచారం అందిన వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు హంతకుడిని కాల్చి చంపారు.

ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపిన వివ‌రాల మేర‌కు..దుండ‌గుడు ఊహించ‌ని రీతిలో మాల్‌లో ప్ర‌వేశించి, త‌న చేతిలో ఉన్న క‌త్తితో జనంపై విరుచుకుపడ్డారు. సుమారు తొమ్మిది మందిపై దాడి జరిపాడని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆంథోని కూకె ఒక వార్తా సంస్థ‌కు తెలిపారు. నిందితుడిపై కాల్పులు జరపడంతో అతను అక్క‌డికక్క‌డే చ‌నిపోయిన‌ట్లు ఆయన వెల్లడించారు.

దుండగుడి దాడిలో ఐదుగురు మరణించినట్టు ధ్రువీకరించారు. మాల్‌లో ఉన్న సిబ్బందిని వెంటనే అక్కడ్నించి తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు ముందుగానే మాల్‌లోని జనాన్ని దూరంగా వెళ్లిపోమని హెచ్చరించి హంతకుడిని చుట్టుముట్టారని, కాల్పుల్లో అతను మరణించాడని వారు చెప్పారు. దుండగుడు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడనేది విచార‌ణ‌లో తేలాల్చి ఉంది.

Latest News