Mangalasutra Viral: 70ఏళ్ల వివాహ బంధం..రూ.20కే మంగళ సూత్రం !

Mangalasutra for Rs.20! : ఆ పెద్దాయన వయసు 93ఏళ్లు..భార్య వయసు 85ఏళ్లు. వారిద్దరికి పెళ్లి జరిగి 70ఏళ్లు గడిచింది. తన భార్యకు ఎన్నో ఏళ్లుగా మంగళ సూత్రం కొనివ్వాలని అనుకుంటున్నాడు. చివరకు వృద్దాప్యంలో అవసాన దశకు చేరుకున్నామని..ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తన భార్యకు మంగళసూత్రం కొనివ్వలేననుకున్నాడేమో ఆ వృద్ధుడు. తన వద్ధ ఉన్న డబ్బులతో జ్యువెలరీ షాపు వెళ్లి మంగళసూత్రం కొనాలని చేసిన ప్రయత్నం..ఆ తర్వాత జరిగిన పరిణామాల వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అందరి హృదయాలను హత్తుకుంటుంది.
మహారాష్ట్ర జల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృతి షిండే(93), శాంతాబాయి(85) భార్యాభర్తలు. ఇద్దరికీ వివాహమై 70 ఏళ్లకుపైనే అయ్యింది. భార్య కోరిక మేరకు ఎప్పటి నుంచో అనుకున్నట్లుగా మంగళసూత్రం కొనివ్వాలని షిండే ఆమెను పట్టణంలోని జ్యువెలరీ షాపుకు తీసుకెళ్లాడు. తొలుత డబ్బులు అడుక్కొవడానికి షాపు లోపలికి వచ్చారని భావించిన షాపు యజమాని వారిని లోనికి అనుమతించలేదు. అయితే తాను మంగళసూత్రం కొనడానికి వచ్చానని షిండే చెప్పడంతో ఆ వృద్ధ దంపతులను షాపు లోకి అనుమతించారు. షాపులోని మంగళ సూత్రాలను వారికి చూపించాడు. నీ వద్ధ ఎంత డబ్బు ఉందని షిండేను అడుగగా..రూ.1120 ఉన్నాయని అమాయకంగా చెప్పాడు. దీంతో షాక్ గురైన షాపు యజమాని ఆ వృద్ద దంపతుల అమాయకత్వం..బంగారం ధర కూడా తెల్వకుండా 93ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం కొనాలనుకున్న షిండే సంకల్పం చేసి ఆశ్చర్యపోయాడు.
ఆ దంపతుల అన్యోన్యత..దాంపత్య అనుబంధం చూసిన షాపు యజమాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వృద్ధ దంపతల మధ్య ప్రేమానుబంధానికి ఫిదా అయిపోయిన జ్యవెలరీ షాపు యజమాని వారికి మంగళసూత్రంతో పాటు కమ్మల జత కూడా ఉచితంగా ఇచ్చాడు. అయితే తమ వద్ధ ఉన్న డబ్బులు తీసుకోవాలని షిండే కోరగా.. షాపు యజమాని ఆ వృద్ద దంపతుల నుంచి రూ.20తీసుకుని మిగతా 1100వారికే తిరిగి ఇచ్చేశాడు. ఆ వృద్ద దంపతుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. 70ఏళ్ల వైవాహిక బంధం తర్వాతా కూడా పరస్పరం ఆ వృద్ద దంపతుల మధ్య తరగని ప్రేమానుబంధం నన్ను ఎంతో కదిలించింది..ఈ రోజుల్లోని యువతరానికి ఈ వృద్ధ జంట ఆదర్శమని ఆ షాపు యజమాని కొనియాడారు.
View this post on Instagram