Love is Blind | 19 ఏండ్ల అమ్మాయిని పెళ్లాడిన 70 ఏండ్ల వృద్ధుడు..
Love is Blind | ఓ ఇద్దరి మనసులు కలిశాయంటే అక్కడ ప్రేమ చిగురిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారంటే.. ఆ ప్రేమ పొదరిల్లులా మారుతోంది. కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఆ పొదరిల్లులో ఆ జంట ఏకం కావడానికి మార్గం సుగమం అవుతుంది. మరి అంత గొప్ప ప్రేమకు వయసు అడ్డు రానే రాదు. ఏ వయసులోనైనా ప్రేమించుకోవచ్చు. ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు. ఓ 70 ఏండ్ల వృద్ధుడు.. 19 ఏండ్ల వయసున్న అమ్మాయిని వివాహం చేసుకుని తమ ప్రేమను […]

Love is Blind | ఓ ఇద్దరి మనసులు కలిశాయంటే అక్కడ ప్రేమ చిగురిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారంటే.. ఆ ప్రేమ పొదరిల్లులా మారుతోంది. కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఆ పొదరిల్లులో ఆ జంట ఏకం కావడానికి మార్గం సుగమం అవుతుంది. మరి అంత గొప్ప ప్రేమకు వయసు అడ్డు రానే రాదు. ఏ వయసులోనైనా ప్రేమించుకోవచ్చు. ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు. ఓ 70 ఏండ్ల వృద్ధుడు.. 19 ఏండ్ల వయసున్న అమ్మాయిని వివాహం చేసుకుని తమ ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడు వీరి ప్రేమకథ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
పాకిస్తాన్‌కు చెందిన లియాకత్ అలీ(70) ప్రతి రోజు మార్నింగ్ వాక్‌కు వెళ్లేవాడు. అదే సమయంలో 19 ఏండ్ల యువతి కూడా వాకింగ్‌కు వచ్చేది. అయితే ఆ వృద్ధుడు ఓ ప్రేమ పాట పాడుతూ.. ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆ పాటకు ఫిదా అయిన యువతి.. ఇద్దరి మధ్య 50 ఏండ్లు తేడా ఉన్నప్పటికీ.. లియాకత్‌పై మనసు పారేసుకుంది. ఈ క్రమంలో లియాకత్, షుమాలియా మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మొత్తానికి వారిద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించుకున్నారు. ఇక అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
ఈ సందర్భంగా లికాయత్ మాట్లాడుతూ.. ప్రేమించుకోవడానికి వయసు అనేది అడ్డు కానే కాదని స్పష్టం చేశాడు. చట్ట ప్రకారం పెళ్లికి అర్హత కలిగి ఉంటే ఎప్పుడైనా వివాహం చేసుకోవచ్చు అని తెలిపాడు. ప్రేమలో ఉన్నప్పుడు వయసు చూడకూడదని షుమైలా చెప్పుకొచ్చారు. ఈ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.