ప్రపంచంలోనే తొలి కేసు.. 23 రోజుల పసికందు కడుపులో 8 పిండాలు..

Embryos in child Stomach | విధాత: ఇది అరుదైన ఘటన.. 23 రోజుల పసికందు కడుపులో 8 పిండాలు బయటపడ్డాయి. మొదటగా ఆ పిండాలను కణితులుగా అనుమానించారు వైద్యులు. కానీ అబ్జర్వేషన్ చేసి.. శస్త్ర చికిత్స నిర్వహించి, తొలగించిన తర్వాత అవి పిండాలుగా నిర్ధారించబడ్డాయి. యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.. 21 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి శస్త్ర చికిత్స నిర్వహించి, ఆ పిండాలను తొలగించారు. ఇది ప్రపంచంలోనే తొలి […]

ప్రపంచంలోనే తొలి కేసు.. 23 రోజుల పసికందు కడుపులో 8 పిండాలు..

Embryos in child Stomach | విధాత: ఇది అరుదైన ఘటన.. 23 రోజుల పసికందు కడుపులో 8 పిండాలు బయటపడ్డాయి. మొదటగా ఆ పిండాలను కణితులుగా అనుమానించారు వైద్యులు. కానీ అబ్జర్వేషన్ చేసి.. శస్త్ర చికిత్స నిర్వహించి, తొలగించిన తర్వాత అవి పిండాలుగా నిర్ధారించబడ్డాయి.

యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

21 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి శస్త్ర చికిత్స నిర్వహించి, ఆ పిండాలను తొలగించారు. ఇది ప్రపంచంలోనే తొలి కేసు అని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో వెలుగు చూసింది.

ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రామ్ ఘర్హ్ కు చెందిన ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండు రోజుల తర్వాత ఆ పసిపాప కడుపునొప్పితో బాధ పడింది. పొత్తి కడుపు కూడా వాచిపోయింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు శిశువును రాంచీలోని రాణి చిల్డ్రన్ హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు పసిపాపకు సీటీ స్కాన్ నిర్వహించి కడుపులో కణితులు ఉన్నట్లు గుర్తించారు.

మెడిసిన్స్ ఇచ్చి 21 రోజుల తర్వాత రమ్మన్నారు. అబ్జర్వేషన్ అనంతరం నవంబర్ 2వ తేదీన పాపకు గంటన్నర పాటు శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో ఉన్న కణతులను తొలగించారు. అయితే అవి కణతులు కాదు.. పిండాలు అని డాక్టర్లు నిర్ధారించారు. మొత్తం 8 పిండాలను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు.

నాగుపాము ప‌డ‌గ‌కు ముద్దు పెట్టాడు.. ఆ తర్వాత? (Video)

ఈ సందర్భంగా డాక్టర్ ఇమ్రాన్ మాట్లాడుతూ.. పాపకు శస్త్ర చికిత్స విజయవంతమైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 5 నుంచి 10 లక్షల మందిలో ఒకరిలో ఇలాంటి కేసు సంభవిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు 200 వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ 200 మంది శిశువుల్లో ఒకట్రెండు పిండాలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. కానీ ఈ శిశువులో 8 పిండాలు ఉండటం ప్రపంచంలోనే తొలి కేసు అని స్పష్టం చేశారు.

పారసిటమాల్ వేసుకుంటున్నారా? జర జాగ్రత్త..!