14 గంటల్లో 800 భూకంపాలు.. అల్లాడిపోయిన ఐస్‌లాండ్
- బద్దలైన అగ్నిపర్వతాలు
- దేశంలో ఎమర్జెన్సీ ప్రకటన
రెక్జావిక్ : 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలతో ఐస్‌లాండ్ అల్లాడిపోయింది. అందులో అతిపెద్ద భూకంపం రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. శుక్రవారం నుంచి సంభవించిన వరుస భూకంపాల తీవ్రతకు దక్షిణ పశ్చిమ ప్రాంతంలోని ద్వీప ప్రాంతాల్లో పలు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఈ పరిస్థితిలో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. భూకంపాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం వల్ల అగ్నిపర్వతాలు కూడా బద్దలు కావడానికి కారణమయ్యాయి. అగ్నిపర్వతాల విస్ఫోటం మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. గ్రీన్ వీక్ లో దక్షిణ పశ్చిమ ప్రాంతంలో వరుసగా భూకంపాలు వచ్చాయి.
ఈ ప్రాంతంలో 4000 మంది ప్రజలు ఉంటారు. ఇది దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ఇది ఐస్‌లాండ్ రాజధాని రెక్ జా విక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో కిటికీలు, దర్వాజలు ఊగిపోయి.. కూలాయి. గత అక్టోబర్‌లో ఇటువంటివే 24000 కంపాలు ఈ ద్వీప సముదాయంలో రిజిస్టర్ అయ్యాయి. కానీ.. ఇప్పుడు గంటల వ్యవధిలోనే 800 భూకంపాలు నమోదయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram