కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 ఖాళీలు
మార్చి1, 2021 నాటికే ఇన్ని లక్షల ఖాళీలు ఈ రెండేళ్ల ఖాళీలను కలుపుకుంటే ఇంకా ఎక్కువే వీటి గురించి ఎన్నడూ ప్రశ్నించని బీజేపీ నేతలు అచ్ఛేదిన్.. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే నినాదాలతోనే కాలం వెళ్లదీస్తున్న కాషాయ నేతలు విధాత: బీజేపీ నేతలు ఏం చేసినా దేశం కోసం.. ధర్మం కోసం అని అంటుంటారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంటారు. ఇక వాట్సప్ యూనివర్సిటీ నుంచి అప్పటికప్పుడు వండి వార్చిన అనేక […]

- మార్చి1, 2021 నాటికే ఇన్ని లక్షల ఖాళీలు
- ఈ రెండేళ్ల ఖాళీలను కలుపుకుంటే ఇంకా ఎక్కువే
- వీటి గురించి ఎన్నడూ ప్రశ్నించని బీజేపీ నేతలు
- అచ్ఛేదిన్.. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే నినాదాలతోనే కాలం వెళ్లదీస్తున్న కాషాయ నేతలు
విధాత: బీజేపీ నేతలు ఏం చేసినా దేశం కోసం.. ధర్మం కోసం అని అంటుంటారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంటారు. ఇక వాట్సప్ యూనివర్సిటీ నుంచి అప్పటికప్పుడు వండి వార్చిన అనేక అసత్యాలను విస్తృతంగా ప్రచారం ప్రచారం చేస్తుంటారు.
తొమ్మిదేళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో రిక్రూట్‌మెంట్ అనేది లేదంటే అతిశయోక్తి కాదు. కొండలా ఏటా పెరిగిపోతున్న ఖాళీల భర్తీ గురించి కేంద్రం ఆలోచించడం లేదని అనేకసార్లు సార్లు రుజువైంది. తాజాగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 9,79, 327 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్ పార్లమెంటులో బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వీటిలో అత్యధికంగా రైల్వేలో 2,93,943, రక్షణ శాఖలో 2,67,706, కేంద్ర హోం శాఖలో 1, 43, 534 ఖాళీలు ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.
దేశ భద్రతకు సంబంధించిన రక్షణ శాఖ, శాంతిభద్రతలకు సంబంధించిన హోం శాఖల్లో 4 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇవి కూడా మార్చి1,, 2021 నాటికే. ఈ రెండేళ్ల కాలంలో ఈ ఖాళీల సంఖ్యగ ఇంకా పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వ కార్మిక విభాగమే నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా దేశంలో నిరుద్యోగ శాతం పెరిగిందని ఇచ్చిన తన గణాంకాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ ఖాళీల భర్తీ గురించి చర్యలు తీసుకోరు. కానీ ఆ పార్టీ నేతలు, వారి గొంతుకగా మాట్లాడే కొందరు గవర్నర్లు, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థితికి చేరాలని ఉచిత సలహాలు ఇస్తుంటారు.
ఈ ఖాళీల గురించి ఇక్కడి బీజేపీ నేతలు ప్రస్తావించరు. సామాన్యులకు భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరల కట్టడి గురించి అడుగరు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపుపై ప్రశ్నించరు. మోడీ ఏం చేసినా.. అది అద్భతమని.. దేశం కోసం.. అచ్ఛేదిన్ కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటారు. మతం, కులం, పాకిస్థాన్, సర్జికల్ స్ట్రైక్ వంటి అంశాలే వారి ఎన్నికల ప్రచారాస్త్రాలు. కొవిడ్ సంక్షోభంలో లక్షలాది ఉద్యోగాలు పోయాయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.
కరోనా సమయంలోనూ దేశ జీడీపికి వెన్నుదన్నుగా ఉన్న వ్యవసాయరంగాన్ని కుప్పుకుల్చడానికి నల్లచట్టాలు తెచ్చి రైతుల ఆగ్రహానికి గురయ్యారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఉన్న ఊళ్లలోనే ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆహారభద్రత పథకాన్ని తెచ్చింది.
దీంతో లక్షలాదిమందికి గ్రామీణ ప్రాంత వాసులకు ఆ పథకాలు ఊరట కలిగించాయి. వాటినీ కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏటా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ.. మెల్ల మెల్లగా ఆ పథకాన్ని వదిలించుకునే పనిలో పడింది. అన్నిరంగాలను సంక్షోభంలోకి నెట్టే అచ్ఛేదిన్.. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే నినాదాలతోనే కాషాయ నేతలు కాలం వెళ్లదీస్తున్నారు.