హైదరాబాద్‌లో దారుణం.. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
Hyderabad | అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. జంతువులను వేటాడినట్టు కుక్కలన్నీ ఆ బాలుడిపై విరుచుకుపడ్డాయి. క్షణాల్లోనే బాబు ప్రాణాలను బలిగొన్నాయి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి తన భార్య జనప్రియ, కుమార్తె(6), కుమారుడు ప్రదీప్(4)తో కలిసి బాగ్అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో నివాసముంటున్నాడు. గంగాధర్ అంబర్‌పేటలోని ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా […]

Hyderabad | అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. జంతువులను వేటాడినట్టు కుక్కలన్నీ ఆ బాలుడిపై విరుచుకుపడ్డాయి. క్షణాల్లోనే బాబు ప్రాణాలను బలిగొన్నాయి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి తన భార్య జనప్రియ, కుమార్తె(6), కుమారుడు ప్రదీప్(4)తో కలిసి బాగ్అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో నివాసముంటున్నాడు. గంగాధర్ అంబర్‌పేటలోని ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి.. ఎంతో కలచివేసిందన్న కేటీఆర్
అయితే ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలను ఇద్దర్ని తీసుకొని, కారు సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లాడు. కూతుర్ని పార్కింగ్ ప్రదేశంలోని క్యాబిన్ వద్ద ఉంచాడు. ప్రదీప్‌ను తన వెంట సర్వీస్ సెంటర్‌లోకి తీసుకెళ్లాడు. అయితే గంగాధర్ పని మీద మరో వాచ్‌మెన్‌తో కలిసి వెళ్లాడు.
ఈ క్రమంలో బాలుడు తన అక్క వద్దకు వెళ్తుండగా, వీధి కుక్కలు వెంటపడ్డాయి. ఆ వీధి కుక్కల నుంచి తప్పించుకునేందుకు తన శక్తిమేర ప్రయత్నించాడు. కానీ ఆ కుక్కలు ఒకదాని తర్వాత మరొకటి ఆ చిన్నారిపై దాడి చేశాయి. ఓ కుక్కనేమో చిన్నారి కాలును, మరో కుక్కనేమో చేయిని పట్టుకుని లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
బాలుడి ఆర్తనాదాలు విన్న సోదరి అప్రమత్తమై తండ్రికి సమాచారాన్ని చేరవేసింది. తండ్రి వచ్చి కుక్కలను చెదరగొట్టాడు. తీవ్ర గాయాలపాలైన బాబును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.