Chips Packet | బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ

చిప్స్ ప్యాకెట్లో వచ్చిన చిన్న బొమ్మతో ఆడుకునే క్రమంలో దాని మింగేయడంతో నాలుగేళ్ల బాలుడు మరణించాడు. ఈ విషాద ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

  • By: chinna |    national |    Published on : Nov 20, 2025 8:10 PM IST
Chips Packet | బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ

విధాత :
సాధారణంగా చిన్నపిల్లలు చిప్స్, చాక్టెట్లు తింటుంటారు. ఎంతవారించిన అవి తినడం మాత్రం మానరు. తల్లిదండ్రులు పిల్లల అల్లరిని తగ్గించడానికి కూడా చిప్స్, చాక్లెట్లు కొనిస్తుంటారు. ఓ పక్క చిప్స్ తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, చిప్స్ ప్యాకెట్ల కంపెనీలు వారి సేల్స్ పెంచుకోవడానికి రకరకాల ఆఫర్లు పెడుతున్నారు. వాటిని కొనిపించేలా టీవీల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. దీనికి తోడు కొన్ని కంపెనీలు చిప్స్ ప్యాకెట్లలో మినియేచర్ బొమ్మలను పెట్టి అమ్మతున్నాయి.

ఈ బొమ్మల వల్ల పిల్లలు మరింత ఆకర్షితులై చిప్స్ ప్యాకెట్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాటిల్లో వచ్చిన బొమ్మలతో ఆడుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల బాలుడు మినియేచర్ బొమ్మను మింగి మరణించాడు. ఈ ఘటన ఒడిశాలోని చోటుచేసుకుంది. కంధమాల్ జిల్లాలోని ముసుమహపాడ గ్రామంలో చిప్స్ ప్యాకెట్ లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు బిగిల్ ప్రధాన్ చనిపోయాడు. బాలుడి తండ్రి తీసుకొచ్చిన చిప్స్ ప్యాకెట్ లో ఉన్న బొమ్మ తుపాకితో బాలుడు ఆడుకుంటూ అనుకోకుండా మింగేశాడు. గమనించిన తల్లిదండ్రులు బొమ్మను తొలగించేందుకు ప్రయత్నించారు అయినా సాధ్యం కాలేదు. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.