Hyderabad | హైదరాబాద్‌లో దారుణం.. తాగిన మత్తులో నడిరోడ్డుపై యువతిని వివస్త్రను చేసి..
Hyderabad | ఓ యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య(30) కూలీ. తాగుడుకు బానిసగా మారిన మారయ్య.. ఆదివారం రాత్రి కూడా పీకల దాకా సేవించాడు. ఇక తన తల్లితో కలిసి రాత్రి 8:30 గంటలకు […]
Hyderabad | ఓ యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య(30) కూలీ. తాగుడుకు బానిసగా మారిన మారయ్య.. ఆదివారం రాత్రి కూడా పీకల దాకా సేవించాడు. ఇక తన తల్లితో కలిసి రాత్రి 8:30 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక యువతి(28) దుకాణం నుంచి ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసిన మారయ్య.. కామంతో రగిలిపోయాడు. ఆమెపై చేయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కోపంతో అతన్ని దూరంగా నెట్టేసింది.
దీంతో విచక్షణ కోల్పోయిన మారయ్య.. ఆమెపై దాడి చేశాడు. ఆమె దుస్తులను లాగి చింపేశాడు. మారయ్య తల్లి కనీసం కొడుకును అడ్డుకోలేదు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ఓ మహిళ ప్రయత్నించగా, ఆమెపై కూడా మారయ్య దాడి చేసేందుకు యత్నించాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ యువతి నగ్నంగానే రోడ్డుపైనే రోదిస్తూ కూర్చుంది. కనీసం చుట్టుపక్కల వారు స్పందించలేదు. అక్కడ్నుంచి మారయ్య వెళ్లిన తర్వాత.. యువతికి కొందరు వస్త్రాలు ఇచ్చి.. జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram