తెలంగాణ‌లో కాంగ్రెస్‌కే జ‌న్‌కీబాత్‌ మొగ్గు

తెలంగాణలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నదని సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌పోల్‌ అభిప్రాయపడింది.

  • By: Somu    latest    Nov 30, 2023 12:11 PM IST
తెలంగాణ‌లో కాంగ్రెస్‌కే జ‌న్‌కీబాత్‌ మొగ్గు
  • హంగ్ అన్న సీఎన్‌ఎన్‌

విధాత: తెలంగాణ‌లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తుంద‌ని జ‌న్ కీ బాత్ ఎగ్జిట్‌పోల్ స‌ర్వే అంచ‌నా వేసింది. మొత్తం 119 స్థానాల‌కు గాను.. 48 నుంచి 64 స్థానాల్లో ఆ కాంగ్రెస్ విజ‌యం సాధించే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపింది. అధికార బీఆరెస్ 40 నుంచి 55 సీట్ల మ‌ధ్య ఆగిపోతుంద‌ని వెల్ల‌డించింది. బీజేపీ 7 నుంచి 13 సీట్ల‌లో, ఎంఐఎం 4 నుంచి 7 సీట్ల‌లో గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొన్న‌ది.


ఇక తెలంగాణలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నదని సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌పోల్‌ అభిప్రాయపడింది. అధికార బీఆరెస్‌ 48 సీట్ల వద్దే ఆగిపోతుందని, కాంగ్రెస్‌ 56 సీట్లు సాధించి మెజార్టీకి దూరంగా నిలిచిపోతుందని పేర్కొన్నది. ఎంఐఎం ఐదు, బీజేపీ 10 సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.