Diarrhoea | యూట్యూబ్ చూసి సొంత వైద్యం.. 10 కర్పూరం బిళ్లలను మింగేశాడు..
Diarrhoea | ఓ యువకుడు డయేరియా బారిన పడ్డాడు. ఇక ఆస్పత్రికి వెళ్లకుండా.. యూట్యూబ్‌లో చూసి సొంతంగా వైద్యం చేసుకున్నాడు. అనంతరం ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. లాతేహార్ జిల్లా బలుమత్ మండలంలో అవదేశ్ కుమార్ సాహు అనే యువకుడు డయేరియా బారిన పడ్డాడు. కానీ ఆస్పత్రికి వెళ్లలేదు. డయేరియా నివారణకు సంబంధించిన వీడియోలను యూ ట్యూబ్‌లో చూశాడు. ఆ వీడియోల్లో సూచించిన విధంగా విరేచనాలు తగ్గేందుకు […]

Diarrhoea |
ఓ యువకుడు డయేరియా బారిన పడ్డాడు. ఇక ఆస్పత్రికి వెళ్లకుండా.. యూట్యూబ్‌లో చూసి సొంతంగా వైద్యం చేసుకున్నాడు. అనంతరం ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. లాతేహార్ జిల్లా బలుమత్ మండలంలో అవదేశ్ కుమార్ సాహు అనే యువకుడు డయేరియా బారిన పడ్డాడు. కానీ ఆస్పత్రికి వెళ్లలేదు. డయేరియా నివారణకు సంబంధించిన వీడియోలను యూ ట్యూబ్‌లో చూశాడు.
ఆ వీడియోల్లో సూచించిన విధంగా విరేచనాలు తగ్గేందుకు అవదేశ్ 10 కర్పూరం బిళ్లలను మింగాడు. క్షణాల్లోనే అతని ఆరోగ్యం క్షీణించింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రిమ్స్‌కు వైద్యులు రెఫర్ చేశారు.
ఇటీవల ఓ యువకుడు తన భార్యకు యూట్యూబ్‌లో చూసి ప్రసవం చేసిన సంగతి తెలిసిందే. మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమె చనిపోయింది. ఇలా యూట్యూబ్ వీడియోలను అనుసరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.