KU | సమిష్టి కృషితోనే కేయుకు A+ గ్రేడ్: వైస్ చాన్సలర్ ప్రొ. తాటికొండ రమేష్

KU | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి 'ఏ ప్లస్' గుర్తింపు విశ్వవిద్యాలయం ఉద్యోగుల సమిష్టి కృషితోనే వచ్చిందనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అన్నారు. విశ్వవిద్యాలయం భవిష్యత్తు, ఈ గుర్తింపు పైనే ఆధారపడి ఉంటుందని, పరిశోధన రంగానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని, వివిధ కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. సోమవారం వర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయని అన్నారు. […]

  • By: krs    latest    Jul 10, 2023 2:53 PM IST
KU | సమిష్టి కృషితోనే కేయుకు A+ గ్రేడ్: వైస్ చాన్సలర్ ప్రొ. తాటికొండ రమేష్

KU |

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి ‘ఏ ప్లస్’ గుర్తింపు విశ్వవిద్యాలయం ఉద్యోగుల సమిష్టి కృషితోనే వచ్చిందనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అన్నారు. విశ్వవిద్యాలయం భవిష్యత్తు, ఈ గుర్తింపు పైనే ఆధారపడి ఉంటుందని, పరిశోధన రంగానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని, వివిధ కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు.

సోమవారం వర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయని అన్నారు. 2009, 2017 లల్లో గుర్తింపు రాగా 2023లో ఏ ప్లస్ రావడం అభినందనీయమన్నారు.

దీనికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్య కార్యదర్శి వాకాటికరణకు వీసి కృతజ్ఞతలు తెలిపారు. మ్యాక్ గుర్తింపు ముందు పదివేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, పలు భవనాలు రోడ్లు మరమ్మతులు చేయించామని అన్నారు. కొన్ని మరమ్మత్తులు చేయాల్సి ఉన్నదని మరి వాటిలో ముందుగా మన యూనివర్సిటీ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని చెప్పారు.

భూ పరిరక్షణకు విశ్వవిద్యాలయ చుట్టూ కాంపౌండ్ వాల్ త్వరలోనే నిర్మించబోతున్నామన్నారు. అంతేకాకుండా కాకతీయ విశ్వవిద్యాలయంలో అంతర్గత రోడ్డులో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామని వివరించారు. మహిళా హాస్టల్ నిర్మాణానికి త్వరలో కార్యచరణ చేపడతామని, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు ముందుకు సాగుతామని అన్నారు.

విశ్వవిద్యాలయం పరిధిలోని ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు ఐటీడీఏ గిరిజన ప్రాంతాలలో విద్య వ్యవస్థను మెరుగు పరుస్తామని తెలిపారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందే విధముగా చూస్తామన్నారు. భవిష్యత్తులో విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా కేంద్రానికి మంచి భవిష్యత్తు ఉన్నదని, నూతన కోర్సులు ఏర్పరచుకోవడానికి ‘ఎ ప్లస్’ ద్వారా అన్ని అనుమతులు మనము సమకూర్చుకోవచ్చుని చెప్పారు.

నూతన కోర్సులను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ప్రొఫెసర్ టి శ్రీనివాసరావు పాల్గొన్నారు కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులకు, ఉద్యోగులకు, అధ్యాపకులకు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.