Breast Feeding | తల్లిపాలు తాగిన వారు.. పరీక్షల్లో రాణిస్తున్నారు
విధాత: ఎక్కువ రోజులు తల్లిపాలు (Breast Feeding) తాగిన పిల్లలు భవిష్యత్తులో పరీక్షల్లో రాణిస్తున్నారని ఓ పరిశోధన నిగ్గు తేల్చింది. బాల్యంలో కనీసం ఒక సంవత్సరం పాటు అమ్మ పాలు తాగిన పిల్లలు.. అలా తాగని వారి కంటే 38 శాతం ఎక్కువగా పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నారని గుర్తించారు. ఇంగ్లిష్ పరీక్షలో ఆ పిల్లలకు A, A* గ్రేడ్‌లు వచ్చాయని పేర్కొంది. ఆ పిల్లలే గణితంలోనూ అదరగొట్టారని అధ్యయనకర్తలు తెలిపారు. తల్లి స్తన్యంలో ఉండే పాలీ అన్‌సాట్యురేటెడ్ […]

విధాత: ఎక్కువ రోజులు తల్లిపాలు (Breast Feeding) తాగిన పిల్లలు భవిష్యత్తులో పరీక్షల్లో రాణిస్తున్నారని ఓ పరిశోధన నిగ్గు తేల్చింది. బాల్యంలో కనీసం ఒక సంవత్సరం పాటు అమ్మ పాలు తాగిన పిల్లలు.. అలా తాగని వారి కంటే 38 శాతం ఎక్కువగా పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నారని గుర్తించారు.
ఇంగ్లిష్ పరీక్షలో ఆ పిల్లలకు A, A* గ్రేడ్‌లు వచ్చాయని పేర్కొంది. ఆ పిల్లలే గణితంలోనూ అదరగొట్టారని అధ్యయనకర్తలు తెలిపారు. తల్లి స్తన్యంలో ఉండే పాలీ అన్‌సాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్.. శిశువుల మెదడు అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇంగ్లండ్‌లోని మొత్తం 5 వేల మంది విద్యార్థులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కనీసంలో కనీసం పుట్టిన తర్వాత నాలుగు సార్లు అమ్మ పాలు తాగిన విద్యార్థులు.. అలా తాగని వారికంటే పరీక్షల్లో 12 శాతం తక్కువగా బీ,సీ గ్రేడ్‌లు వచ్చాయని తేలింది.