కెనాడో భార‌త సంత‌తి వ్య‌క్తి ఇంటిపై కాల్పులు

కెనడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిపై దాడి జ‌రిగింది. సర్రేలోని లక్ష్మీనారాయణ అధ్యక్షుడి కుమారుడు సతీశ్‌కుమార్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు

  • Publish Date - December 29, 2023 / 07:30 AM IST

  • లక్ష్మీ నారాయణ మందిర్ అధ్యక్షుడి కుమారుడు
  • సతీశ్‌కుమార్ ఇంటిపై దుండగుల దాడి


విధాత‌: కెనడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిపై దాడి జ‌రిగింది. సర్రేలోని లక్ష్మీ నారాయణ మందిర్ అధ్యక్షుడి కుమారుడు సతీశ్‌కుమార్ ఇంటిపై గురువారం ఉదయం గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉద‌యం ఆలయ అధ్యక్షుడి ఇంటిపై కనీసం 14 రౌండ్లు కాల్పులు జరిగాయి. అదృష్టవశాత్తూ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.


ఘటనకు సంబంధించి నిందితుల‌ను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 27న తెల్లవారుజామున ఆర్‌సీఎంపీ ప్రాంతంలోని ఒక నివాసంపై కాల్పులు జ‌రిగిన ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఇంటికి భారీగా బుల్లెట్లు త‌గ‌డంలో గోడ‌ల‌కు రంధ్రాలు ప‌డిన‌ట్టు బ్లాక్ ఆఫ్ 80 ఎవెన్యూ పోలీసులు వెల్ల‌డించారు.

Latest News