Radio Waves వాషింగ్టన్: ఆకాశంలో అంతుబట్టని విచిత్రమైన వస్తువును ఇటీవల కనుగొన్నట్టు ప్రపంచ ప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘నేచర్’లో పొందు పరిచిన నివేదిక వెల్లడించింది. అది ప్రతి 22 నిమిషాలకు ఒక సారి భూమి పైకి రేడియో తరంగాలను వెదజల్లుతున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తరంగాల విడుదల 5 నిమిషాల పాటు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. దీనికి GPM J 1839-10 అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ వస్తువు భూమికి దాదాపు 15,000 కాంతి సంవత్సరాల దూరంలో […]
Radio Waves
వాషింగ్టన్: ఆకాశంలో అంతుబట్టని విచిత్రమైన వస్తువును ఇటీవల కనుగొన్నట్టు ప్రపంచ ప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘నేచర్’లో పొందు పరిచిన నివేదిక వెల్లడించింది. అది ప్రతి 22 నిమిషాలకు ఒక సారి భూమి పైకి రేడియో తరంగాలను వెదజల్లుతున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ తరంగాల విడుదల 5 నిమిషాల పాటు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. దీనికి GPM J 1839-10 అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ వస్తువు భూమికి దాదాపు 15,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నదని తెలిపారు.
ఇది గత 35 సంవత్సరాలుగా.. అంటే 1988 నుంచి రేడియో వేవ్స్ ను వెదజల్లుతున్నది. బహుశా ఇదొక నక్షత్రమే అయి ఉండొచ్చని అభిప్రాయాన్ని కూడా శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది అరుదైన చాలా శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలను కలిగివున్నదని, దీని నుంచి వెలువడుతున్న అతి సూక్ష్మ, బలమైన రేడియో వేవ్స్ ను విశ్లేషించలేక పోతున్నామని ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఆండ్రీవ్ గ్రిఫ్ఫిన్ అన్నారు.
ఇటువంటి చిత్రమైన వస్తువులు గతంలో చాలానే శాస్త్రజ్ఞులు కనుగొనగా ఇది వాటికి భిన్నంగా, అంతు బట్టని విధంగా ఉందని ఎంసీ గిల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ విక్టోరియా ఎం కస్పీ చెప్పారు. దీనిపై విస్తృత పరిశోధనలు జరపాల్సి ఉందని అన్నారు.